'పోయిన నా ప్రాణం నాకు దక్కింది' | Ustad Amjad Ali Khan gets back his sarod | Sakshi
Sakshi News home page

'పోయిన నా ప్రాణం నాకు దక్కింది'

Published Tue, Jul 1 2014 2:38 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

'పోయిన నా ప్రాణం నాకు దక్కింది'

'పోయిన నా ప్రాణం నాకు దక్కింది'

న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత కళాకారుడు ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ప్రాణంగా చూసుకున్న సరోద్ వాయిద్యం ఆయన దక్కింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో లండన్ నుంచి న్యూఢిల్లీ ప్రయాణిస్తున్న సమయంలో తన సరోద్ వాయిద్యం గల్లంతైంది. గత 45 ఏళ్లు ఎన్నో కచేరిలిచ్చి.. ప్రాణంగా చూసుకున్న సరోద్ వాయిద్యం గల్లంతు కావడంతో ఆయన ఆందోళనకు లోనయ్యారు. 
 
ఇదో చారిత్రాత్మక కలయిక. నా సరోద్ ను బ్రిటీష్ ఎయిర్ వేస్ అప్పగించింది. మీ ప్రేమ, ప్రార్ధనలకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా నాకు బాసటగా నిలిచింది. ప్రాణం నాకు దక్కింది  అంటూ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ట్వీట్ చేశారు. 
 
బ్రిటిష్ ఎయిర్ లైన్స్ తో ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం ఇది తొలిసారి కాదు.. 1997లో కూడా సరోద్ వాయిద్యాన్ని దెబ్బతినేలా చేశారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement