
సహాయ చర్యలకూ వెళ్లలేని స్థాయిలో..
తమిళనాడు రాజధాని చెన్నై నగరం భారీవర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. నగరంలో ఎటు చూసినా నడుంలోతు, పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నా.. వాళ్లు కాలు కదిపేందుకు కూడా వీలు కుదరడం లేదు. దీంతో సహాయక చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యాంశాలు:
- రిజర్వాయర్లన్నీ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి
- దాంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి.
- సహాయ చర్యలకు కూడా వీలుకానంత పరిస్థితి ఏర్పడింది
- శివార్లలో ఉన్న రిజర్వాయర్లతో పాటు అడయార్ నది కూడా నిండిపోయి, ఆ వరదనీరు చెన్నై నగరంలోకి చేరుకుంది
- వాహనాలేవీ కదల్లేని పరిస్థితి
- రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది
- అన్ని రహదారులలో పడవల్లో మాత్రమే తిరగగలిగే అవకాశం ఉంది
- నడుం లోతు నీళ్లు, పీకల్లోతు నీళ్లలో నగరం మునిగిపోయింది
- సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వీలు కావట్లేదు
- ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నా, ఎప్పటికప్పుడు వరదనీరు పెరుగుతుండటంతో వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది
- గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు
- నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫోన్లు కూడా పనిచేయడం లేదు.
- ఎప్పుడూ సురక్షితం అనుకునే విమానాశ్రయం వరదనీటితో మునిగిపోయింది
- మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది
- ఇప్పటికే 70 వేల మంది సిబ్బంది సహాయపనుల్లో ఉన్నారు
- అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యం కావట్లేదు
- అడయార్ నది కూడా పొంగడంతో శివార్లలో ఉన్న 4 లక్షల ఇళ్లు నీటమునిగాయి
- నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితి నెలకొంది.
- ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.
- ఇళ్లలో ఉండేవాళ్లు మొదటి లేదా రెండో అంతస్థులకు వెళ్లి తలదాచుకుంటున్నారు
- ఈ పరిస్థితి ఎన్నాళ్లనేది తెలియడం లేదు
- చెన్నైలోని 24 జోన్ కార్యాలయాలతో పాటు అన్నిచోట్లా బృందాలు సిద్ధంగా ఉన్నాయి
- కానీ వాళ్ల వాహనాలు కూడా కదిలే పరిస్థితి ఎక్కడా లేదు
- బోట్లలో వెళ్లాలన్నా కూడా ఇబ్బందిగానే ఉందని సిబ్బంది చెబుతున్నారు
- సీఎం జయలలితతో ప్రధాని మోదీ చర్చించారు
- కేంద్ర మంత్రివర్గం కూడా చెన్నై పరిస్థితిని సమీక్షించింది
- భారీవర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం సాయం చేయడానికి కూడా ఏమాత్రం వీలుండకపోవచ్చన్న భయాందోళనలు నెలకొంటున్నాయి
- నగరం వదిలి వెళ్లిపోదామన్నా.. ఇంట్లోంచి బయటకు కాలు పెట్టలేకపోతున్నారు.
- దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది.