ఈ పామును చూసైనా నేర్చుకోండి | Viral Video Of Sand Viper Concealing Itself Gives An Important Message | Sakshi
Sakshi News home page

ఈ పామును చూసైనా నేర్చుకోండి

Published Wed, May 13 2020 6:25 PM | Last Updated on Thu, May 14 2020 3:21 AM

Viral Video Of Sand Viper Concealing Itself Gives An Important Message - Sakshi

న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచం మొత్తం సతమతమవుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వేలాది మంది తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది రోగులు జీవన్మరణ పోరాటం సాగిస్తున్నారు. దీనికి మందు లేదు. భౌతిక దూరం పాటించడం ద్వారానే వైరస్‌ను నివారించగలం. ఈ విషయాన్ని వైద్యశాఖ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా చెబుతున్నారు. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ ప్రముఖులంతా పిలుపునిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్. (చదవండి : కేక్స్‌ త‌యారు చేస్తున్న మూడేళ్ల బుడ్డోడు)

కరోనా బారిన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లో ఉండాలంటూ ఓ పాము  వీడియోను ట్వీట్‌ చేశారు. వీడియో ప్రకారం..  ఇసుక తిన్నెతో ఉన్న ఓ పాము కొంచెం కొంచెం కదిలి, తనను తాను దాచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పాము తన తలతో సహా శరీర మొత్తం భాగంపై ఇసుకను కప్పేసుకుంటుంది. 
(చదవండి : ఫన్నీ వీడియో పోస్ట్‌ చేసిన సానియా మీర్జా)

 జాగ్రత్తగా పరిశీలిస్తే, లోతుగా వెళ్ళే ప్రయత్నంలో పాము పూర్తిగా ఇసుకలో ఉన్న తరువాత కూడా కదులుతూనే ఉంటుంది. ఈ వీడియోను కస్వాన్‌ ట్వీట్‌ చేస్తూ దొంగదెబ్బ తీయడానికి పాము సాండ్‌ వైపర్‌ తనను రహస్యంగా దాచి ఉంచుకుంది. అలాగే మనం కూడా ఇళ్లలోనే ఉండి వైరస్‌తో పోరాడుదాం అని పిలుపు నిచ్చారు. కొన్నేళ్ల క్రితం ఫోటోగ్రాఫర్ జేవియర్ అజ్నార్ చిత్రీకరించిన ఈ వీడియో కస్వాన్ షేర్ చేసి, కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండమని చెప్పడంతో మళ్లీ వైరల్ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement