కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టంలోని వైఎస్సార్ సీపీ ప్రతిపాదించిన సవరణలపై ఓటింగ్ జరిగింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుపై వైఎస్సార్ సీపీ ప్రతిపాదించిన సవరణలకు సంబంధించి ఓటింగ్ జరిగింది. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ తీర్మానాన్ని తప్పనిసరి చేయడమే కాకుండా, మూడు పంటలను భూములను భూసేకరణ చట్టం తొలగించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించారు. దీనిపై వైఎస్సార్ సీపీకి అనుకూలంగా 101 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 311 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్సార్ సీపీ ప్రతిపాదనలు వీగిపోయాయి.
ఇదిలా ఉండగా భూసేకరణ చట్టంలోని సవరణలపై సభ నుంచి బీజేడీ వాకౌట్ చేసింది. రైతుల అంగీకారం, సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ తీర్మానాలు తాము వ్యతిరేకమంటూ సభ నుంచి బీజేడీ వాకౌట్ అయ్యింది. అయితే కొన్ని సవరణలకు మాత్రం బీజేడీ మద్దతు తెలిపింది.