న్యూఢిల్లీ: పత్తి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్తో బుధవారం దత్తాత్రేయ సమావేశమయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గంగ్వార్ కూడా పాల్గొన్నారు. నలుగురు మంత్రులు తెలంగాణలో పత్తి రైతుల సమస్యలపై చర్చించారు.