తెలంగాణలో 113 పత్తి కొనుగోలు కేంద్రాలు పెంచుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ హామీ చెప్పారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో 113 పత్తి కొనుగోలు కేంద్రాలు పెంచుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ హామీ చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్తో బుధవారం దత్తాత్రేయ సమావేశమయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గంగ్వార్ కూడా పాల్గొన్నారు. నలుగురు మంత్రులు తెలంగాణలో పత్తి రైతుల సమస్యలపై చర్చించారు.
పత్తిలో తేమ ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని రాధా మోహన్ సింగ్ తెలిపారు. పత్తి కొనుగోలులో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించామని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా చర్చలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.