వెల్‌కమ్ టు ఇండియన్ రైల్వే | Welcome to Indian Railways | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్ టు ఇండియన్ రైల్వే

Published Mon, Feb 22 2016 1:45 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

వెల్‌కమ్ టు ఇండియన్ రైల్వే - Sakshi

వెల్‌కమ్ టు ఇండియన్ రైల్వే

న్యూఢిల్లీ: త్వరలో ఈ పిలుపును దేశ రైళ్లలో వినబోతున్నారు. బోగిలోకి ఎక్కగానే వీనులవిందైన సంగీతం.. నవ్వుతూ చూడచక్కని భామలు.. చేతిలో గులాబీ పువ్వుతో స్వాగతం చెప్పనున్నారు. విమానాల్లో మాదిరిగానే త్వరలో రైళ్లలోనూ హోస్టెస్‌లు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రైన్ హోస్టెస్‌లను నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముందుగా ఢిల్లీ-ఆగ్రా-గాటిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో హోస్టెస్‌లను నియమించనున్నారు.

గాటిమాన్ ఎక్స్‌ప్రెస్.. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు. వచ్చే నెలలో ప్రారంభించనున్న ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విమానాల్లో మాదిరిగానే హోస్టెస్‌లను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు. ఇలాంటి తరహా 9 రైళ్లను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని రైలే ్వ చూస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement