సీజన్ టికెట్‌దారులకు రైల్వేశాఖ రూ.4 లక్షల విలువైన ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
భువనేశ్వర్: సీజన్ టికెట్‌దారులకు రైల్వేశాఖ రూ.4 లక్షల విలువైన ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, రోజూ రైలు ప్రయాణం చేసేవారు దీన్ని వినియోగించుకోవాలని, ప్రయాణానికి ముందే టికెట్ కొనే విధానానికి స్వస్తిపలకాలని కోరింది.రోజూ 1-20 కి.మీలు ప్రయాణించేవారు నెలవారీ సీజన్ టికెట్(ఎంఎస్‌టీ)కు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.
అలాకాక ప్రతిరోజు టికెట్ కొంటే రూ. 600 ఖర్చవుతుంది. అలాగే త్రైమాసిక సీజన్ టికెట్(క్యూఎస్‌టీ)కు రూ.270 చెల్లించాలి. రానుపోనుకు మూడు నెలలపాటు టికెట్ కొంటే రూ.1800 ఖర్చవుతుంది. ఎంఎస్‌టీ, క్యూఎస్‌టీ టికెట్‌దారులు లోకల్ ప్యాసింజర్ రైళ్లలో అపరిమితంగా ప్రయాణించవచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.