చెలరేగిన హింస, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో బుధవారం ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలివేశారు. బదూరియా ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్న్న అగౌరపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌తో రెండు రోజుల క్రితం గొడవలు మొదలయ్యాయి. శాంతి భద్రతల కోసం రాష్ట్ర పోలీసులకు తోడుగా 400మంది బీఎస్‌ఎఫ్ జవాన్లను ప్రభుత్వం మోహరించింది. మరోవైపు ఫేస్‌బుక్‌లో ఆ పోస్ట్ పెట్టిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా బదూరియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మత ఘర్షణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి తనను బెదరించారనీ, అవమానపరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే మమత ఆరోపణలను గవర్నర్ ఖండించారు. తాను సీఎంను అవమానపరచలేదని, ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని కేసరీనాథ్ పేర్కొన్నారు.