'మోదీ అవినీతిపై 2013లో ఎందుకు మాట్లాడలేదు?' | Why didn't Congress raise Modi's corruption in 2013: Kejriwal | Sakshi
Sakshi News home page

'మోదీ అవినీతిపై 2013లో ఎందుకు మాట్లాడలేదు?'

Published Thu, Dec 22 2016 1:34 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

'మోదీ అవినీతిపై 2013లో ఎందుకు మాట్లాడలేదు?' - Sakshi

'మోదీ అవినీతిపై 2013లో ఎందుకు మాట్లాడలేదు?'

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అవినీతిపై ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని, 2013లోనే ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తలేదని ప్రశ్నించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ 2013లో పనిచేస్తున్నప్పుడే ఆయన అవినీతి గురించి తెలిస్తే ఆ సమయంలోనే చర్యలు తీసుకోవచ్చుగా అని మండిపడ్డారు.

ఎందుకంటే ఆ సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఒప్పందం కుదిరి ఉండొచ్చంటూ ఓ వీడియోలో అనుమానం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ శక్తుల నుంచి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లంఛాలు తీసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల అనంతరం కాంగ్రెస్‌ డిమాండ్‌ను తొలుత సమర్థించిన కేజ్రీవాల్‌ అనంతరం కాంగ్రెస్‌ 2013లోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement