
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి ప్రజలపై అక్కసు వెళ్లగక్కారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన బాదామి అసెంబ్లీ నియోజకవర్గం భాగల్‌కోట్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో బిజెపి పార్టీ గెలిచింది. దీని గురించి బాదామిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలప్పుడు ఇక్కడ బిజెపి ఆధిక్యంలో ఉందన్న వార్తలను చూసి నేను షాకయ్యాను. మేం మీకోసం పంచాయతీ భవనాలు కట్టించాం. మీకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాం. అయినా మమ్మల్ని కాదని బిజెపికి ఎందుకు ఓటు వేశారని ప్రజలను నిలదీశారు. ఇటీవలే సిద్ధరామయ్య మీడియాతో.. మోదీ నోట్లు రద్దు చేసి ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారు. దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. అయినా ప్రజలు మోదీ మోదీ అని ఎందుకంటున్నారో నాకైతే అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment