Badami
-
బాదం పొడితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది..!
బాదం పొడి ఒక టీ స్పూన్ (బాదంపప్పు మీద ఉండే పొట్టుతో సహా గ్రైండ్ చేసినది), బాదం నూనె ఒక టీ స్పూన్, గసగసాల పొడి ఒక టీ స్పూన్, గోధుమ పిండి ఒక టీ స్పూన్, పన్నీరు తగినంత తీసుకోవాలి. బాదం పొడి, గసాల పొడి, గోధుమ పిండిలో బాదం నూనె, తగినంత పన్నీటితో పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత వలయాకారంగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. -
మాకెందుకు ఓటేయలేదు?: సిద్ధరామయ్య
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి ప్రజలపై అక్కసు వెళ్లగక్కారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన బాదామి అసెంబ్లీ నియోజకవర్గం భాగల్‌కోట్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో బిజెపి పార్టీ గెలిచింది. దీని గురించి బాదామిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలప్పుడు ఇక్కడ బిజెపి ఆధిక్యంలో ఉందన్న వార్తలను చూసి నేను షాకయ్యాను. మేం మీకోసం పంచాయతీ భవనాలు కట్టించాం. మీకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాం. అయినా మమ్మల్ని కాదని బిజెపికి ఎందుకు ఓటు వేశారని ప్రజలను నిలదీశారు. ఇటీవలే సిద్ధరామయ్య మీడియాతో.. మోదీ నోట్లు రద్దు చేసి ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారు. దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. అయినా ప్రజలు మోదీ మోదీ అని ఎందుకంటున్నారో నాకైతే అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. -
‘పొడుగు బొట్లను చూస్తే భయమేస్తుంది’
బాదామి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో పలు వివాదాలు కేంద్ర బిందువుగా నిలిచిన ఆయన.. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నుదిటిపై కుంకుమ బొట్టు, విభూది పెట్టుకునేవారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య మంగళవారం బాదామిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అర్చకులు తొలుత పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రసంగించిన సిద్దరామయ్య.. నుదుటిపై పొడవాటి బొట్టు పెట్టుకున్న ఓ వ్యక్తిని చూపిస్తూ బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారు. ‘నుదుటిపై పొడవైన కుంకుమ బొట్లు, విభూది పెట్టుకున్న వారిని చూసి నేను భయపడుతున్నాను. మీరు నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అయితే సక్రమంగా పని చేస్తారా?. ఎవరైనా సరే సకాలంలో వారికి కేటాయించిన పనిని సక్రమంగా పూర్తి చేయాలి. నుదిటిపై పొడవైన బొట్లు పెట్టుకున్నవారిని చూస్తే నాకు ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేద’ని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు సిద్దరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH Former Karnataka CM and Congress leader Siddaramaiah, says, "I am scared of people who put long tikas with kumkum or ash", at an event, in Badami, Karnataka, yesterday pic.twitter.com/2UMjVI3DkL — ANI (@ANI) 6 March 2019 -
అయ్యో పాపం.. పిల్లలను ఉతికేశారు
దొడ్డబళ్లాపురం: పిల్లలకు మంచి చదువులు చెప్పి కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు బాధ్యత మరచి ప్రవర్తించారు. తన హ్యాండ్‌బ్యాగులో ఉన్న 500 రూపాయలు కనబడలేదని ఇద్దరు టీచర్లు 5వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను వరుసగా నిలబెట్టి బెత్తంతో చితకబాదిన సంఘటన మాజీ సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామి తాలూకాలో చోటుచేసుకుంది. టీచర్లు కొట్టిన దెబ్బలకు పిల్లల శరీరంపై రక్తగాయాలతోపాటు బొబ్బలు వచ్చాయి. బాధతో పిల్లలు ఏడుస్తుంటే తల్లితండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బాదామి తాలూకా రాఘాపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న అశ్విని, చంద్రు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అశ్విని బ్యాగులో 500 రూపాయలు కనబడలేదని దాన్ని పిల్లలే తీశారని అనమానంతో ఆమెతో పాటు చంద్రు కలిసి బెత్తం తీసుకుని 10 మంది విద్యార్థులను నిజం చెప్పమంటూ తీవ్రంగా కొట్టారు. గ్రామస్తులపైనా మండిపాటు విషయం తెలిసి ఇదేమని ప్రశ్నిస్తే తమతో పెట్టుకోవద్దని గ్రామస్తులను బెదిరించారు. ఈ సంఘటన కవరేజీకి వెళ్లిన ఒక టీవీ చానెల్ రిపోర్టర్‌ను కూడా టీచర్లు వదల్లేదు. కాలర్ పట్టుకుని బెదిరించినట్లు సమాచారం. ఇంత జరిగినా బీఈఓ కానీ, డీడీ కానీ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. -
బాదామిలో సిద్ధరామయ్యను ఓడిస్తాం
-
అప్పుడలా..ఇప్పుడిలా
సాక్షి, బెంగళూరు: బాదామి నియోజకవర్గంలో పోటీ చేయడంపై సీఎం సిద్ధరామయ్య పలుసార్లు పలు రకాలుగా స్పందించారు. అసలు బాదామి నుంచి పోటీ చేస్తారా లేదా అనే ఊహగానాల నుంచి ప్రచారం నిర్వహించే వరకు వచ్చింది. అయితే బాదామి విషయంలో ఇప్పటికే అస్థిరత్వంగానే ఉన్నారు. ఆయన మాట తీరు దగ్గర నుంచి కార్యాచరణ వరకు అంత అయోమయంగానే సాగుతోంది. బాదామి విషయంలో రకరకాలుగా సిద్ధరామయ్య స్పందిచడం విశేషం. ఈ క్రమంలో తాజాగా బాదామిలో పోటీ చేయడంపై మాట్లాడుతూ... ఉత్తర, దక్షిణ కర్ణాటకలను కలిపేందుకే ఇక్కడ నిలుచున్నానని ప్రకటించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించేందుకు తన పోటీ చేస్తున్నట్లు.. ఇది ఒక ప్రయోగంగా తాను భావిస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన పోస్ట్ చేశారు. గత పాలకులు రాష్ట్ర రాజధాని బెంగళూరుకు ఉత్తర కర్ణాటక ప్రాంతాలు దూరంగా ఉండడంతో అశ్రద్ధ వహించారని చెప్పారు. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తరాది భాగంగా అంతగా అభివృద్ధి చెందలేదని తెలిపారు. దీంతో ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు తమ పార్టీ బాదామి నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. మనం ఎక్కడ పుట్టినా అందరం కర్ణాటకకు చెందిన వారేనని తెలిపారు. అంతేకాకుండా చాముండేశ్వరిలో ఓడిపోతాననే భయంతోనే తాను బాదామిలో పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జేడీఎస్‌లు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. అయితే తాను బాదామి ప్రజల పిలుపు మేరకు ఇక్కడ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలా అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రులు దేవెగౌడ, బంగారప్ప, ప్రస్తుత ప్రధాని మోదీ రెండు చోట్ల పోటీ చేశా>రని గుర్తు చేశారు. వాళ్లను ప్రశ్నించని నేతలు తన దగ్గరకు వచ్చేసరికి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని చెప్పారు. మరోవైపు బాదామి విషయంలో సీఎం పలు సందర్భాల్లో పలు రకాలుగా మాట్లాడారు. ఒకసారి చాముండేశ్వరి నుంచి మాత్రమే పోటీ చేస్తానని, మరో సారి అధిష్టానం నిర్ణయమేనని, ఇంకోసారి బాదామి ప్రజలు పోటీ చేయాలని కోరుతున్నారని ఇలా పలు రకాలుగా పలు సందర్భాల్లో సీఎం వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో సీఎం వ్యాఖ్యలు.. 2017, అక్టోబర్ 6– 2018 శాసనసభ ఎన్నికలే నా జీవితంలో చివరివి. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తాను. 2018, మార్చి 30–చాముండేశ్వరి నుంచే పోటీ చేస్తున్నాను. కుమారస్వామికి ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలి. 2018, ఏప్రిల్ 5– రెండు స్థానాల నుంచి పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2018, ఏప్రిల్ 6– నాకు రాజకీయ జన్మనిచ్చిన చాముండేశ్వరి నుంచి మాత్రమే పోటీ చేస్తాను. 2018, ఏప్రిల్ 16–నా జీవితంలో రెండు స్థానాల నుంచి ఎప్పుడూ పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా పోటీ చేయబోను. చాముండేశ్వరి నుంచి మాత్రమే బరిలో నిలబడుతాను. 2018, ఏప్రిల్ 18–అధిష్టానం నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇప్పటికీ అదే మాటమీదే ఉన్నాను. రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై నాకు ఆసక్తి లేదు. 2018, ఏప్రిల్ 22–బాదామి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. 2018, ఏప్రిల్ 25–బాదామి నుంచి పోటీ చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చు. -
రెండు స్థానాల నుంచి సిద్దరామయ్య పోటీ
-
అందుకే బాదామి బరిలో
మైసూరు: చాముండేశ్వరితో పాటు బాగల్‌కోట జిల్లా బాదామి నుంచి కూడా పోటీ చేయడానికి కారణాన్ని సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో వెల్లడించారు. ఉత్తర కర్ణాటక ప్రజలు బాదామిలో పోటీ చేయమని నన్ను ఒత్తిడి చేశారు, దీంతో అదిష్టానం పెద్దల ఆదేశాల మేరకు బాదామిలో పోటీ చేస్తున్నానని, ఈ నెల 24వ తేదీన అక్కడ నామినేషన్ దాఖలు చేస్తాను అని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదివారం ఉదయం మైసూరు మండకళ్ళి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని, ఇదే మొదటిసారని తెలిపారు. తాను బాదామి నుంచి పోటీ చేయడం ద్వారా అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందని పట్టుబట్టికోరుతున్నారని, పార్టీ పెద్దలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బాదామిలో బీజేపీ నుంచి బళ్లారి ఎంపీ శ్రీరాములు పోటీ చేస్తారనడంపై స్పందిస్తూ, ఇతర పార్టీల నుంచి ఎవరు నిలబడినా తాను తలనొప్పి తెచ్చుకోబోనని, గెలిచేది తానేనని అన్నారు. చాముండేశ్వరిలో ఓటమి భయంతోనే బాదామికి వెళ్తున్నట్లు జేడీఎస్ నాయకులు విమర్శించడంపై స్పందిస్తూ, ఓటమి భయంతోనే కుమారస్వామి కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నాడా?, ప్రదానమంత్రి నరేంద్ర మోదీ కూడా పరాజయం భయంతోనే రెండు చోట్ల పొటీ చేశారా? అనిప్రశ్నించారు. కుమారస్వామి చాముండేశ్వరిలో ఎన్నిరోజులైనా ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. -
రెండు చోట్లా సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతోపాటు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ స్థానంలో సిద్దరామయ్యతో పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. బాదామీ స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థిగా దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. సిద్దరామయ్యకు రెండో సీటు కేటాయించాలా వద్దా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో దేవరాజ్‌కు ఇప్పటివరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. బాదామీ నుంచీ సిద్దరామయ్య పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారని సీఎం కార్యాలయం వెల్లడించింది. చాముండేశ్వరి స్థానానికి సిద్దు ఇప్పటికే నామినేషన్ వేయడం విదితమే. కర్ణాటకలో పెద్ద నోట్ల వరద న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నగదు కొరత పట్టిపీడిస్తుంటే.. కర్ణాటకలో మాత్రం నోట్ల వరద పారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలు క్యాష్ లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆ రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేపట్టగా రూ.4.13 కోట్ల నగదు పట్టుబడింది. ఇందులో 97 శాతం రూ.2000, రూ.500 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు ఐటీ అధికారులు వెల్లడించారు. ‘ఇటీవల కర్ణాటకలో చేపట్టిన సోదాల్లో రూ.4.13 కోట్ల నగదు, రూ.1.32 కోట్ల విలువైన 4.52 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నగదు మొత్తంలో రూ.2000, రూ.500 నోట్లే రూ.4.03 కోట్లు ఉన్నాయి’ అని ఐటీశాఖ తెలిపింది. మార్చి 27న కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
రెండో సీటూ కావాలి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేస్తారా? లేక ఉత్తర కర్ణాటకలోని బాదామీ నుంచి కూడా పోటీ చేయనున్నారా? ఈ విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినా సీనియర్ నాయకులు ఖర్గే, మొయిలీల ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను చాముండేశ్వరి స్థానానికే పరిమితం చేసింది. బాదామీలో దేవరాజ్ పాటిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తన అసంతృప్తిని ఇప్పటివరకు సిద్దరామయ్య బహిరంగంగా వెల్లడించలేదు కానీ.. బాదామీ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వివిధ వేదికలపై వ్యక్తపరిచారు. బాదామీ నియోజకవర్గ నేతలు తనను పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. అధిష్టానంతో చర్చలు రాహుల్ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ మొదట్నుంచీ రెండో స్థానంలో పోటీని తోసిపుచ్చింది. అయినా, బీసీల చాంపియన్‌గా పేరున్న సిద్దరామయ్యను నిరాశకు గురిచేస్తే ఫలితాలు వేరోలా ఉంటాయనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అందుకే పాటిల్‌కు ఇంతవరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. అటు, సీఎం రెండో సీటు కోసం అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏడుసార్లు చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సీఎం ఐదుసార్లు గెలిచారు. ఈ సారి చాముండేశ్వరి నుంచి గెలవటం సులభం కాదనే అభిప్రాయంలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. -
బాదామి మాటెత్తలేదు
మైసూరు: తాను బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఎక్కడ ఎప్పుడూ చెప్పలేదని, ఇప్పటివరకు తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సోమవారం ఉదయం మైసూరులో మండకళ్ళి విమానాశ్రయంలో మీడియాతోసీఎం మాట్లాడుతూ తాను బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పలేదని, అంతా మీడియా సృష్టించిందేనని, ఎప్పుడూ కూడా తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని అన్నారు. తాను చాముండేశ్వరి నియోజకవర్గం నుంచే పోటి చేస్తున్నానని, ఈ నెల 20వ తేదిన నామినేషన్ కూడా వేస్తానని అన్నారు. టికెట్ల పంపిణీ విషయంలో కొంతమందికి అసహనం కలగడం వాస్తవమేనని, అలాంటి వారిని పిలిచి మాట్లాడతానని, ఈ నెల 20వ తేదీ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని అన్నారు. చాముండిలో గెలుపు నాదే సీఎం సిద్ధరామయ్య ఒక నెల పూర్తిగా రామనగర, చెన్నపట్టణంలో ప్రచారం చేసినా కూడా ఇక్కడ గెలిచేది తానేనని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి చేసిన సవాలుపై సిద్ధరామయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా ఎవరు గెలవాలనేది ప్రజలు తీర్పు ఇస్తారని, ఓట్లను కుమారస్వామి, కాని, తాను కాని జేబుల్లో పెట్టుకోవడం లేదని అన్నారు. కుమారస్వామి గడచిన పార్లమెంటు ఎన్నికల్లో వీరప్ప మొయిలీపై చిక్కబళ్ళాపురలో పోటీ చేసి ఓడిపోయారు, ఆయన భార్య అనిత చన్నపట్టణంలో పోటీ చేసి పరాజయం పొందారని, అప్పుడు కుమారస్వామి సవాలు ఎక్కడకు పోయిందని హేళన చేశారు. చాముండేశ్వరిలో తానే గెలుస్తానని చెప్పారు. -
'షీనా హత్య ప్రతి కదలిక ఆయనకు తెలుసు'
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్వయంగా తానే కన్న కూతురుని చంపించినట్లు ఒప్పుకోగా.. ఆ వరుసలో త్వరలోనే ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా చేరనున్నారు. షీనా హత్యకు సంబంధించిన ప్రతి చిన్న విషయం పీటర్ కు ముందే తెలుసని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పీటర్ ముఖర్జియా సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారుల తరుపు న్యాయవాది భరత్ బాదామి కోర్టుకు ఏం చెప్పారంటే.. 'షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా కీలక పాత్ర పోషించారు. హత్యకు సంబంధించిన ప్రతి కదలిక పీటర్ కు తెలుసు. హత్య జరగడానికి ఒక రోజు కూడా పీటర్ కు ఇంద్రాణి ఫోన్ చేసింది. 686 సెకన్లు(దాదాపు 11 నిమిషాలు పైగా) మాట్లాడింది. హత్య ప్రణాళికను ఎలా పూర్తి చేయాలని వారు డిస్కస్ చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంద్రాణి ఆయనకు తెలియజేసింది' అని వెల్లడించారు. గతంలో కూడా పీటర్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.