![కాంగ్రెస్ ముఖ్య ప్రచారకుల్లో ప్రియాంక - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51485295806_625x300.jpg.webp?itok=Ewa_NtPU)
కాంగ్రెస్ ముఖ్య ప్రచారకుల్లో ప్రియాంక
లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సోదరుడు రాహుల్ గాంధీతో కలసి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రచారంలో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు ముఖ్య ప్రచారకుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈసీకి పంపింది. రాహుల్, ప్రియాంకలతో పాటు, గులాం నబీ ఆజాద్, రాజ్ బబ్బర్, షీలా దీక్షిత్ తదితరుల పేర్లు జాబితాలో ఉన్నాయి.