
కాగితపు హాల్‌టికెట్లు ఇవ్వం: యూపీఎస్సీ
వచ్చే నెలలో జరగనున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కాగితపు అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్లు) ఇవ్వబోమని యూపీఎస్సీ తెలిపింది.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కాగితపు అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్లు) ఇవ్వబోమని యూపీఎస్సీ తెలిపింది. ఈ-అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసింది. వీటిని డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులే సొంతంగా ప్రింట్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు రావాలని కోరింది.
ఒకవేళ ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోయినా, సరిగా కనపడకపోరుునా వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసిన దానికి సారూప్యంగా ఉండే ఫొటోతోపాటు ఏదేని గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులను కోరింది.