'మా పార్టీలోకి సిద్ధూ వస్తే ఆహ్వానిస్తాం' | Will welcome Sidhu if he wants to join AAP: Kejriwal | Sakshi
Sakshi News home page

'మా పార్టీలోకి సిద్ధూ వస్తే ఆహ్వానిస్తాం'

Published Sat, Dec 5 2015 7:34 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

'మా పార్టీలోకి సిద్ధూ వస్తే ఆహ్వానిస్తాం'

'మా పార్టీలోకి సిద్ధూ వస్తే ఆహ్వానిస్తాం'

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను తెరపైకి తీసుకువస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

శనివారం హిందుస్తాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న కేజ్రీవాల్ ఓ ప్రశ్నకు సమాధానంగా.. 'ఆప్లోకి రావాలని సిద్ధూ భావిస్తే.. మేం స్వాగతం పలుకుతాం' అని చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో పంజాబ్ లో క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనవసరంలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement