ప్లే గ్రౌండ్‌లోనే ప్రసవించింది! | Woman delivers baby at playground | Sakshi
Sakshi News home page

ప్లే గ్రౌండ్‌లోనే ప్రసవించింది!

Published Mon, Aug 21 2017 2:20 PM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

ప్లే గ్రౌండ్‌లోనే ప్రసవించింది!

ప్లే గ్రౌండ్‌లోనే ప్రసవించింది!

ఛత్తీస్‌ఘడ్‌: ప్లే గ్రౌండ్‌లో ఓ మహిళ పండండి బిడ్డవకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం జైపూర్‌ జిల్లాలోని ఘుగ్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గర్భవతి పురిటి నొప్పులతో ఆమె బందువు సహయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అది తెరవకపోవడంతో ఆసుపత్రి ముందు గంటకుపైగా నిరీక్షించారు. వారు 102, 108 నంబర్లకు ఫోన్‌ చేసినా స్పందించలేదు.

దీంతో ఆసుపత్రి పక్కన ఉన్న ఆట స్థలంలో బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది గంటల అనంతరం ఆమె తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లింది. విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహించడంతో ఆ సమయంలో ఆసుపత్రి తెరిచే ఉందని, ఒక నర్సు విధులు నిర్వహిస్తుందని డాక్టర్‌ సాహు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement