మరొకరికి ప్రాణం పోసింది | Woman delivers baby girl in Mumbai local train | Sakshi
Sakshi News home page

ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళకు ప్రసవం

Oct 10 2017 11:54 AM | Updated on Oct 8 2018 5:45 PM

Woman delivers baby girl in Mumbai local train - Sakshi

సాక్షి, ముంబై : ఒక్క రూపాయి క్లినిక్‌... లోకల్, మెట్రో రైల్వే స్టేషన్‌లలో మహారాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వైద్య సేవల సదుపాయం. ప్రారంభించిన కొద్ది రోజులకే అనూహ్యమైన స్పందన దీనికి వచ్చింది. రైలు స్టేషన్ వద్దకు చేరుకోగానే వైద్యులు రైల్లోకి వెళ్లి వైద్యం అందించటం.. తద్వారా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.  

ఇదిలా ఉంటే గత రాత్రి దాదర్‌ స్టేషన్ వద్ద ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వన్ రూపీ క్లినిక్‌ వైద్యుల సాయంతో ఆమె ప్రసవించింది. కళ్యాణ్ నుంచి సీఎస్‌టీ రూట్లో వెళ్తున్న లోకల్‌ రైల్లో 26 ఏళ్ల సల్మా షేక్‌కి ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో రాత్రి 10గంటల 17 నిమిషాల  సమయంలో దాదర్‌ స్టేషన్‌కు చేరుకోగానే డాక్టర్ ప్రజ్వలిత్‌, ఓ మహిళ రైల్వే పోలీసాధికారి, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ఆమెకు కాన్పు చేశారు.  

ఆ వెంటనే తల్లిబిడ్దలిద్దరినీ ఓ ఆంబులెన్స్‌ సాయంతో కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఈ యేడాది మార్చిలో సుల్తానా ఖటున్‌ అనే మహిళకు కూడా దాదర్‌ స్టేషన్‌లోనే  ఒక రూపాయి క్లినిక్‌ ద్వారా కాన్పు నిర్వహించటం విశేషం. ప్రస్తుతం ఈ వైద్య సేవలు దాదర్.. భైకళ, కుర్లా, ఘాట్కోపర్, విక్రోలి, భాండూప్, ములుండ్, థాణే, కల్వా, ఉల్లాస్‌నగర్, అంబర్‌నాథ్, బద్లాపూర్, వడాల రోడ్, పన్వేల్, సైన్, టిట్వాల, గోవండీ, చెంబూర్, మాన్‌ఖుర్ద్‌ రైల్వే స్టేషన్లలో లభిస్తుండగా.. త్వరలో ఆర్టీసీ బస్టాండ్‌లలో కూడా కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement