మోదీ కోసం ప్రత్యేక రాఖీలు..
మోదీ కోసం ప్రత్యేక రాఖీలు..
Published Thu, Aug 3 2017 12:56 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
వారణాసీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ రాఖీ పండుగకు ప్రత్యేక రాఖీలందుకోనున్నారు. వారణాసీకి చెందిన దుర్గాకుంద్ వృద్ధాశ్రమంలోని మహిళలు మోదీకోసం ప్రత్యేకమైన రాఖీలను రూపొందిస్తున్నారు. గతేడాది కూడా ఈ వృద్ధ మహిళలు మోదీ కోసం ప్రత్యేక రాఖీలు రూపొందించి పంపారు.
ప్రతి ఏటా రాఖీ పండుగ రోజు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసానికి పిల్లలు, విభిన్న మతాల మహిళలను పిలుచుకొని వారితో రాఖీ కట్టించుకుంటారు. భారత్‌లో సోదరి-సోదరుల రక్షణకు ప్రతీకగా రాఖీ పర్వదినాన్ని నిర్వహిస్తారు. ఆగష్టు 7న దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ జరగనుంది.
Advertisement
Advertisement