నా హృదయం చలించింది: ఏఆర్ రెహ్మాన్
దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులలో మాండొలిన్ శ్రీనివాస్ ఒకరంటూ పలువురు సంగీత ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీనివాస్ మృతి విషయం విని తన హృదయం చలించిపోయిందని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న మాండొలిన్ శ్రీనివాస్ (45) శుక్రవారం ఉదయం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. కాలేయ సమస్య కారణంగా ఆయనను కొద్దిరోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన మరణానికి పలువురు సంగీత ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
Emotionally shaken to hear of Carnatic shining star Mandolin Shrinivasji's demise... May God bless him with happiness in the next world...
— A.R.Rahman (@arrahman) September 19, 2014
U. Srinivas one of the finest musicians ever a true Earth Angel left us for his journey skyward .... you will be sorely missed .
— Ehsaan Noorani (@EhsaanNoorani) September 19, 2014
The grt Mandolin exponent U Shrinivas is no more unfortunately. Ws gng thru a liver trnsplnt. Imprvd apparently. Bt succumbed tragically.RIP
— Sonu Nigam (@sonunigam) September 19, 2014