యూఎస్లో 20 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు | 20 per cent jump in Indian students in US since July | Sakshi
Sakshi News home page

యూఎస్లో 20 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు

Published Fri, Dec 18 2015 8:57 AM | Last Updated on Fri, Aug 24 2018 6:25 PM

యూఎస్లో 20 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు - Sakshi

యూఎస్లో 20 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు

వాషింగ్టన్ : యూఎస్లోని పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అది ఎంతగా అంటే 20 శాతం మేర పెరిగిందని యూఎస్ గురువారం విడుదల చేసిన ఓ అధికారిక నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జులై నుంచి నవంబర్ వరకు 1.8 లక్షల మంది  బారతీయ విద్యార్థులు దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్శిటీల్లో చదువుతున్నారని పేర్కొంది. యూఎస్లో భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యపై గతేడాది విడుదల చేసిన నివేదికలో కంటే ఈ ఏడాది 20.7 శాతం అధికమని స్పష్టం చేసింది.

అయితే వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు 1.2 మిలియన్ల మంది యూఎస్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని  ఆ నివేదికలో పేర్కొంది. యూఎస్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలవగా... ఆ తర్వాత వరుస స్థానాలను ఇండియా, దక్షిణ కొరియా నిలిచాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement