
డల్లాస్ : గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మ్రుదుల్ చెరుకుపల్లి ఆమెరికాలోని డల్లాస్‌లో గుండెపోటుతో మృతి చెందారు. మ్రుదల్‌కు ఆదివారం తెల్లువారుజామున గుండెపోటు రావడంతో హుటాహుటిన బెయిలర్ స్కాట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మ్రుదుల్ కన్నుమూశారు. డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మ్రుదుల్‌కు భార్య, ఆరేళ్ల కూతురు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే మ్రుదల్‌ది కష్టపడే తత్వం అని ఆయన స్నేహితులు తెలిపారు.
మ్రుదల్ అకాలమరణంతో ఆయన కుటుంబ సభ్యులను అదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ముందుకొచ్చింది. ఆర్థికపరమైన అవసరాలను తీర్చడానికి నాట్స్ హెల్ప్‌లైన్ టీమ్ వారి కుటుంబసభ్యులు, స్నేహితులను సంప్రదించి వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది. ఇలాంటి కష్టసమయంలో మద్రుల్ కుటుంబానికి బాసటగా నిలవడానికి అందరూ ముందుకురావాలని నాట్స్ పిలుపునిచ్చింది.