లండన్: ఈ రోజు లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ప్రపంచంలో భారత దేశ ప్రతిష్ట పెంచింది ఇందిరా గాంధీ అన్నారు. "గరీబి హఠావో" నినాదంతో భారత దేశంలో పేదిరిక నిర్ములనకు పునాధులువేసి, దళిత గిరిజన బలహీనవర్గాల అండగా ఉంటూ భూ పంపిణీకి పునుకొని, బ్యాంకుల జాతీయికరణతో పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారని, ఇందిరమ్మ తరతరాలకు ఆదర్శనీయం అని తెలిపారు . దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ, భారత దేశం ఐక్యత, సమీకృత అభివృద్ధి, మత సామరస్యం , పేదల అభ్యుదయo కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం అని తెలిపారు . దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకత్వం ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం ఎన్నారైకు చాలా కృషిని అభినందిస్తూ, కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడంలో ప్రతి ఎన్నారై కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల్లో, సంస్కృతి ప్రచారంలో, ప్రజా సమస్యలపై పోరాటంలో లండన్ ఎన్నారై సంస్థలు స్ఫూర్తినీయం అని తెలిపారు.
ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. పుట్టుక, చావు మాత్రమే ఇందిరమ్మది, బతుకు అంతా దేశం కోసమే ఇందిరమ్మ కృషి చేశారన్నారు. దేశ ప్రజలకు ఒక దైర్యంగా ఖ్యాతి గాంచారు. దేశ అభివృద్ధిలో ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయ అని కొనియాడారు.
కార్యక్రమంలో ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పువ్వులు సమర్పించి చిన్నారుల సమక్షంలో 100 వ పుట్టిన రోజుకు ప్రత్యేకంగా తయారు చేపించిన భారీ కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. వంశీచంద్ రెడ్డి సమక్షంలో ఎన్నారై మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు . అస్ర అంజూమ్, సరిత, జి శ్రీధర్ రెడ్డిలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సలహాదారులు గంగసాని ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కో కన్వీనర్లు చిట్టెం అచ్యుత రెడ్డి, రంగుల సుధాకర్ గౌడ్, రాకేష్ బిక్కుమళ్ల, మంగళారపు శ్రీధర్ బాబు, అస్ర అంజూమ్, సరిత, పోటాటి శ్రీకాంత్ రెడ్డి, కొత్త రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నర్సింహా రెడ్డి జాన్సర్, బలరాం, హితేష్ గుప్తా, సుదర్శన్ రెడ్డి, గట్ట మధులు ఇందిరమ్మ గురించి ప్రసంగించి కార్యక్రమం విజయవంతం లో కీలకపాత్ర పోషించారు. అనంతరం టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు లండన్ విచ్చేసిన వంశీ చంద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment