'ఈ విభజన ప్రమాదకరం!’
పార్లమెంట్‌లో ఏం జరిగింది -17
విభజన బిల్లు మీద 20-2- 2014న రాజ్యసభలో జరిగిన చర్చ వివరాలు...
ఏచూరి: విభజనను వ్యతిరేకిస్తున్నాను. నా పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది, వ్యతి రేకిస్తూ నినాదాలు చేస్తున్న సభ్యులు నేను కూడా వ్యతి రేకిస్తున్నానని పట్టించుకోక పోవటం దురదృష్టం.
డిప్యూటీ చైర్మన్: (అంతరాయం కలిగిస్తున్న సభ్యులను ఉద్దేశించి) ఏచూరి మిమ్మల్ని సపోర్టు చేస్తున్నారు. అయినా మీరు ఆపుచేయరే...?
ఏచూరి: ఈ విభజనను మేము వ్యతిరేకిస్తు న్నాం. ఈ దేశానికి ఈ చర్య హాని చేస్తుంది. గుర్తు చేసుకోండి అధ్యక్షా! స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తర్వాత, రాజ్యాంగంలోని మొదటి క్లాజుకు మనం అంగీకరించాం. అదేమిటి- ‘ఇండియా, రాష్ట్రాల సమాహారం’. ‘ఇండియా అంటే భారత్, ఒక రాష్ట్రాల సమాహారం’.
అప్పుడొక ప్రశ్న ఉత్పన్నమయింది. రాష్ట్రం అంటే ఏమిటి. చర్చలూ, ఉద్యమాలూ విరివిగా జరిగాక, భాష ప్రాతిపదికన రాష్ట్రం ఉండాలని నిర్ణయమయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొట్ట మొదటి ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశ యం మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రం, విశాలాంధ్ర ఏర్పడింది. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ విడదీయబడుతోంది. విశాలాంధ్ర నినాదం తర్వాతే సంయుక్త మహారాష్ర్ట, ఐక్య కేరళ వంటి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఆ రాష్ట్రం విడదీస్తున్నారు. మొదటి నుంచీ ఈ విభజనను మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. అందుకే వెంకయ్యనాయుడు గారు తప్పుడు అభిప్రాయం కలిగించేలా మాట్లాడినప్పుడు నేను లేచి సవరిం చాను.
మేమెప్పుడూ ఈ విభజనను అంగీకరిం చలేదు. నేను వ్యక్తిగతంగా కూడా ఈ విభజన ఉద్యమాల వల్ల నష్టపోయాను. 40 ఏళ్ల క్రితం ప్రత్యేకాంధ్ర ఉద్యమ సమయంలో మేము రెండేళ్లు కోల్పోయాం. అప్పుడు ఇందిరాగాంధీ రాజ్యాం గంలో 371-డిని చేర్చి, రాజ్యాంగ సవరణ చేశారు. అదే సరిగ్గా అమలు జరిగివుంటే, ఈ రోజు ఈస్థితి వచ్చేది కాదు. ఆర్థిక ప్యాకేజీలు కావా లంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బేరాలాడటం అత్యంత దురదృష్టకరం. ఈ రెండు పార్టీల ‘మ్యాచ్‌ఫిక్సింగ్’ విభజనకు కారణం. సార్, గుర జాడ అప్పారావు గారి మాట నేను చెప్పదలిచా, ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషు లోయ్’. ఈ రోజు మనుషుల్ని విడదీస్తున్నారు. భాష కారణంగా కలిసిన మనుషుల్ని విడగొట్టేస్తు న్నారు. కొన్ని ప్రయోజనాల కోసం ఈ పని చేస్తు న్నారు.
ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఈ అవకాశవాద చర్యకు పాల్పడింది. రెండు యూపీఏ ప్రభుత్వాలూ ఆంధ్రప్రదేశ్ సీట్ల మీదే నిలబ డ్డాయి. మొదటిసారి 37, రెండోసారి 33. ఇప్పు డేమీ సీట్లొచ్చే అవకాశం లేకపోవడంతో, రాష్ట్రాన్ని విడదీసి లబ్ధి పొందాలని ఆలోచన చేశారు. కేవలం ఎన్నికల కోసం జరుగుతున్న ఈ విభజన వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో, అరాచకత్వం ప్రబ లుతుందో, నీటి కోసం, విద్యుత్ కోసం, ఉమ్మడి ప్రాజెక్టుల కోసం ఎన్ని ఆటంకాలు ఎదురవు తాయో... ఈ బిల్లును లోక్‌సభకు తిప్పి పంపుతూ, భాషాప్రయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నానికి ఈ సభ అంగీకరించదని తెలియజేయాలని నేను కోరుకుం టున్నా! ఈ బిల్లును స్పష్టంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆపి, భారతదేశ భవిష్యత్‌కే ముప్పుగా పరిణమించే ఆంధ్రప్రదేశ్ విభజన విరమించుకోవాలని కోరు తున్నా. నాకు గుర్తుంది సార్! భిన్నత్వంలో ఏక త్వం, ఇదే ఇండియా... భిన్నత్వంలో ఏకత్వం అనేది భాషల ఏకత్వానికి ఉదాహరణ.
ఆ ప్రాతిపదికను ఒకచోట మీరు పాడుచేస్తే, ఇక దీనికి అంతమే ఉండదు. ఒక తేనెతుట్టెను కదుపుతున్నారు. మీరు దేశానికి ఈ అపకారం తల పెట్టవద్దు. అందుకే, మీరు చేస్తున్న సవరణల జోలికి నేనుపోను. నేను విభజననే వ్యతిరేకిస్తున్నా. కాని సంపద విభజిస్తున్నప్పుడు అందర్నీ సమా నంగా చూడాలి. ఏ రాష్ట్రానికీ సవతితల్లి ప్రేమ అందించకూడదు. ప్రధానమంత్రిగారికి, ఈ సభ వివేకానికి నేను వదిలేస్తున్నా... మీరు చేస్తున్న విభజన పర్యవసానాలు అర్థం చేసుకోండి. దీని పర్యవసానం ఇండియాకు మంచి చెయ్యదు. మీ చర్య వల్ల దేశంలో ఏర్పడబోయే అల్లకల్లోలాల్ని అంచనా వేయాలి. అందుకే మీ చర్యను మేము సమర్థించం, తేనెతుట్టె మీద రాయి వేయకండి. ఈ చర్య దేశానికి మంచిది కాదు.
ప్రొ॥రాంగోపాల్ యాదవ్ (ఉత్తరప్రదేశ్): అధ్యక్షా! నేనీ బిల్లును సర్వశక్తులతోనూ వ్యతిరేకి స్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాదు. ప్రజల హృదయాల మధ్య అగాధం సృష్టిస్తోంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుండి ఇందిరా గాంధీ వరకూ, రాష్ట్రాల విభజన వ్యతిరేకించారు.
పండిట్ నెహ్రూ, పెద్ద రాష్ట్రాలే దేశాన్ని కలిపి వుంచే ‘సిమెంట్’లా పనిచేస్తాయని నమ్మేవారు. సర్దార్ పటేల్ ఏర్పరిచిన యూనియన్‌ను విచ్ఛి న్నం చేస్తున్నారు. పటేల్, నెహ్రూ, ఇందిర ఆలోచ నలను విచ్ఛిన్నం చేస్తున్నారు. అధ్యక్షా! రాజ్యాం గం ప్రకారం రాష్ట్రాలలో లా అండ్ ఆర్డర్ కేంద్రం తీసుకునే అవకాశమే లేదు. కానీ ఈ బిల్లులో రాజ్యాంగ విరుద్ధమైన, ఆ ప్రయత్నం కూడా జరు గుతోంది. న్యాయస్థానాలలో ఈ అంశం కొట్టి వేయబడుతుంది. ఇలాంటి పని, వివేకం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. అధ్యక్షా! ఇది దేశ సమగ్రతకే పెద్ద విఘాతం. ఏ రాష్ట్ర విభజన జరిగినా అక్కడి ప్రజల అభీష్టం తెలుసుకుని, శాసనసభ అభిప్రా యంతో జరిగింది. మొట్టమొదటిసారిగా, శాసన సభ విభజన చెయ్యవద్దని నేను భావిస్తున్నాను. పొట్టి శ్రీరాములు మరణానంతరం, 1953లో మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం విభజిస్తున్న సమ యంలోనే, ఈ సభలో విభజన వలన ఏర్పడ బోయే భవిష్యత్ కష్టాల గురించి బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పి ఉన్నారు.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com