బ్రౌన్ దొరకు ఇద్దరు ప్రియురాళ్లు | Brown aristocrat to the two Girlfriends | Sakshi
Sakshi News home page

బ్రౌన్ దొరకు ఇద్దరు ప్రియురాళ్లు

Published Mon, Nov 9 2015 8:21 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

బ్రౌన్ దొరకు ఇద్దరు ప్రియురాళ్లు

బ్రౌన్ దొరకు ఇద్దరు ప్రియురాళ్లు

తెలుగు నా ప్రేయసి అని సగర్వంగా చాటుకున్న సి.పి.బ్రౌన్‌కు నిజజీవితంలో కూడా ఒక ప్రేయసి ఉన్నారు.  మచిలీపట్నంలో ఉద్యోగరీత్యా ఉంటున్నప్పుడు ఆ యువతిని గాఢంగా ప్రేమించారు. వివాహం కూడా చేసుకోదలచినట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాల ద్వారా తెలుస్తుంది. అప్పుడు బ్రౌన్ వయసు 27 ఏళ్లు. మచిలీపట్నంలో పనిచేస్తున్న సమయంలో జూలూరి అప్పయ్యశాస్త్రి ఇంటికి తరచుగా బ్రౌన్ వెళ్ళేవారు. శాస్త్రిగారికి రెండు కాళ్లూ లేవు. వారు పండితులను ఇంటికి పిలిపించుకునే వారు. ఇంట్లోనే సాహిత్య గోష్టులు నిర్వహించేవారు. అలా బ్రౌన్ కూడా ఆ ఇంటికి వెళ్తుండేవారు.

సంస్కృత గ్రంథాలు పరిష్కరించుకునే ప్రయత్నాలే కాకుండా సాహిత్య గోష్టుల్లో కూడా పాల్గొనే వారు. ఆ సమయంలోనే వారు ఆ ఇంట్లో యువతిని మోహించారు. ఆమె పేరు రామనరసమ్మ. ఆ ఇంటి వారికి ఆ యువతి ఏమవుతుందో బ్రౌన్‌కు తెలియదు. 22-25 యేళ్ళ మధ్య ఉండవచ్చని  మిత్రునికి లేఖల్లో వెల్లడించారు బ్రౌన్. ఆమెని చూపుతో చూసి హృదయంతో ప్రేమించినట్లు చెప్పుకొన్నారు. చెన్నపట్నం సివిల్ సర్వీస్‌లో ఉన్న మిత్రుడు జానెట్‌కు ఈ విషయం ఏకంగా ఉత్తరం వ్రాసుకున్నారు. జానెట్ ఇదే విషయాన్ని బ్రౌన్‌కు మరో మిత్రుడైన అప్పట్లో వెస్ట్‌బెంగాల్ సివిల్ సర్వీస్‌లో ఉన్న బర్లీకి ఉత్తరం వ్రాస్తూ రామనరసమ్మను ప్రేమించడం, వివాహం చేసుకోవాలనుకోవడం ఈ సమాచారమంతా ఇస్తూ ఇది ఎలా కుదుర్తుందని ప్రశ్నతో ముగించారు. ఈ ఉత్తరాలే సి.పి.బ్రౌన్ ప్రేమను వెల్లడిచేస్తున్నాయి.

 బ్రౌన్ ప్రేమ విషయం ఆరుద్ర దృష్టికి వచ్చినా ప్రస్తావించలేదు. బంగోరె ప్రస్తావించినా సున్నితంగా దాటవేశారు.  బ్రౌన్‌కు తెలుగు భాష మీద ఉన్న ప్రేమతో తూచి, ఈ ప్రేమను చాలా చిన్నదిగా చూపించారు.
ఈతకోట సుబ్బారావు 9440529785

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement