Sanskrit texts
-
ఉత్తరాఖండ్ మదర్సాల్లో సంస్కృత పాఠాలు
డెహ్రాడూన్: మదర్సాల్లో సంస్కృతంతోపాటు కంప్యూటర్ సైన్స్‌ను బోధించాలనే ప్రతిపాదనకు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు (యూఎంఈబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మదర్సాల్లో గణితం, సైన్స్, ఆయుష్, సాంఘిక శాస్త్రాలను ఐచ్ఛికాంశాలుగా బోధిస్తున్నారు. దీంతోపాటు సంస్కృతం, కంప్యూటర్ సైన్స్‌లను ఐచ్ఛికాంశాలుగా బోధించాలనే అంశాన్ని బోర్డు ఉన్నత స్థాయి కమిటీకి నివేదిస్తామని యూఎంఈబీ డిప్యూటీ రిజిస్ట్రార్ అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. అక్కడ ఓకే అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా మదర్సాల్లో అమలు చేయనున్నామన్నారు. సంస్కృతాన్ని మదర్సాల్లో బోధించాలంటూ ఉత్తరాఖండ్ మదర్సా సంక్షేమ సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
బ్రౌన్ దొరకు ఇద్దరు ప్రియురాళ్లు
తెలుగు నా ప్రేయసి అని సగర్వంగా చాటుకున్న సి.పి.బ్రౌన్కు నిజజీవితంలో కూడా ఒక ప్రేయసి ఉన్నారు. మచిలీపట్నంలో ఉద్యోగరీత్యా ఉంటున్నప్పుడు ఆ యువతిని గాఢంగా ప్రేమించారు. వివాహం కూడా చేసుకోదలచినట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాల ద్వారా తెలుస్తుంది. అప్పుడు బ్రౌన్ వయసు 27 ఏళ్లు. మచిలీపట్నంలో పనిచేస్తున్న సమయంలో జూలూరి అప్పయ్యశాస్త్రి ఇంటికి తరచుగా బ్రౌన్ వెళ్ళేవారు. శాస్త్రిగారికి రెండు కాళ్లూ లేవు. వారు పండితులను ఇంటికి పిలిపించుకునే వారు. ఇంట్లోనే సాహిత్య గోష్టులు నిర్వహించేవారు. అలా బ్రౌన్ కూడా ఆ ఇంటికి వెళ్తుండేవారు. సంస్కృత గ్రంథాలు పరిష్కరించుకునే ప్రయత్నాలే కాకుండా సాహిత్య గోష్టుల్లో కూడా పాల్గొనే వారు. ఆ సమయంలోనే వారు ఆ ఇంట్లో యువతిని మోహించారు. ఆమె పేరు రామనరసమ్మ. ఆ ఇంటి వారికి ఆ యువతి ఏమవుతుందో బ్రౌన్కు తెలియదు. 22-25 యేళ్ళ మధ్య ఉండవచ్చని మిత్రునికి లేఖల్లో వెల్లడించారు బ్రౌన్. ఆమెని చూపుతో చూసి హృదయంతో ప్రేమించినట్లు చెప్పుకొన్నారు. చెన్నపట్నం సివిల్ సర్వీస్‌లో ఉన్న మిత్రుడు జానెట్‌కు ఈ విషయం ఏకంగా ఉత్తరం వ్రాసుకున్నారు. జానెట్ ఇదే విషయాన్ని బ్రౌన్కు మరో మిత్రుడైన అప్పట్లో వెస్ట్‌బెంగాల్ సివిల్ సర్వీస్‌లో ఉన్న బర్లీకి ఉత్తరం వ్రాస్తూ రామనరసమ్మను ప్రేమించడం, వివాహం చేసుకోవాలనుకోవడం ఈ సమాచారమంతా ఇస్తూ ఇది ఎలా కుదుర్తుందని ప్రశ్నతో ముగించారు. ఈ ఉత్తరాలే సి.పి.బ్రౌన్ ప్రేమను వెల్లడిచేస్తున్నాయి. బ్రౌన్ ప్రేమ విషయం ఆరుద్ర దృష్టికి వచ్చినా ప్రస్తావించలేదు. బంగోరె ప్రస్తావించినా సున్నితంగా దాటవేశారు. బ్రౌన్కు తెలుగు భాష మీద ఉన్న ప్రేమతో తూచి, ఈ ప్రేమను చాలా చిన్నదిగా చూపించారు. ఈతకోట సుబ్బారావు 9440529785