
డెహ్రాడూన్: మదర్సాల్లో సంస్కృతంతోపాటు కంప్యూటర్ సైన్స్‌ను బోధించాలనే ప్రతిపాదనకు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు (యూఎంఈబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మదర్సాల్లో గణితం, సైన్స్, ఆయుష్, సాంఘిక శాస్త్రాలను ఐచ్ఛికాంశాలుగా బోధిస్తున్నారు. దీంతోపాటు సంస్కృతం, కంప్యూటర్ సైన్స్‌లను ఐచ్ఛికాంశాలుగా బోధించాలనే అంశాన్ని బోర్డు ఉన్నత స్థాయి కమిటీకి నివేదిస్తామని యూఎంఈబీ డిప్యూటీ రిజిస్ట్రార్ అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. అక్కడ ఓకే అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా మదర్సాల్లో అమలు చేయనున్నామన్నారు. సంస్కృతాన్ని మదర్సాల్లో బోధించాలంటూ ఉత్తరాఖండ్ మదర్సా సంక్షేమ సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment