బౌద్ధం తొలి సామాజిక విప్లవం | Buddhism is the first social revolution | Sakshi
Sakshi News home page

బౌద్ధం తొలి సామాజిక విప్లవం

Published Thu, Apr 30 2015 12:01 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

బౌద్ధం తొలి సామాజిక విప్లవం - Sakshi

బౌద్ధం తొలి సామాజిక విప్లవం

కొత్త కోణం
 
బుద్ధుడు జన్మించేనాటికి పురోహిత వర్గం విచ్చలవిడిగా సాగిస్తున్న యజ్ఞయాగాది కర్మకాండలు సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారాయి. నాడు వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పశు సంపదతోపాటు, ధాన్యాలు, నూనెలు, అటవీ సంపదలు అగ్నికి ఆహుతై పోయేవి. దీంతో వ్యవసాయానికి అత్యావశ్యకమైన పశుసంపదకు తీవ్ర కొరత ఏర్పడింది. వ్యవసాయం, వృత్తులు సంక్షోభంలో పడే దుస్థితి నెలకొంది. సమాజానికి, బ్రాహ్మణ పురోహిత వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని బుద్ధుడు తన ఆచరణాత్మక పోరాటంతో పరిష్కరించాడు.
 
‘‘బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధునిపైనా, ఆయన సామాజిక కార్యాచరణపైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. ఆయనలాగే బుద్ధుని గమ్యం-గమ నంపై దేశదేశాల సామాజిక పరిశోధకులు, శాస్త్రవేత్తలు వందలాదిగా పరిశో ధనా గ్రంథాలను వెలువరించారు. మన దేశంలో దామోదర్ ధర్మానంద్ కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, బి.ఆర్. అంబేడ్కర్, రొమిల్లా థాపర్ లాంటి వాళ్లు ముఖ్యులు. వీరెవరూ బుద్ధుడిని కేవలం మత ప్రవక్తగా చూడలేదు. ఆనాటి పరిస్థితుల్లో బుద్ధుడు ఒక సంపూర్ణ సామాజిక విప్లవాన్ని నడిపినట్టు, దాని ఫలితాలు భారతదేశ గమనాన్ని మార్చి నట్టు పేర్కొన్నారు. సమాజంలో ఏర్పడిన సంక్షోభాన్ని నిర్వచించి, దానిని పరిష్కరించే కార్యాచరణను రూపొందించడం, దానిని కొనసాగించి సఫలీకృ తం కావడం విప్లవకారుల లక్షణం. ఆ విప్లవాత్మక  కర్తవ్యాన్ని గౌతమ బుద్ధు డు అత్యంత శక్తివంతంగా నిర్వర్తించగలిగాడు.

అభివృద్ధికి ఆటంకంగా మారిన కర్మకాండలు

క్రీ.పూ. 566లో సిద్ధార్థుడుగా జన్మించిన గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 485 వరకు జీవించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన జన్మించేనాటికి సామా జిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో  అభివృద్ధిని నిరోధించే శక్తులు సమాజంపై బలమైన ఆధిపత్యాన్ని నెరపుతున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణులలో పురో హిత వర్గం సమాజాభివృద్ధికి అడ్డంకిగా నిలిచింది. వ్యవసాయ వృత్తులు, వ్యాపార రంగాలు వృద్ధిలోకి వస్తున్న రోజులవి. వ్యవసాయం, వృత్తుల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులలో నాణ్యత, ఉత్పాదకత పెరుగుదల కార ణంగా నగరాల, పట్టణాల నిర్మాణం ప్రారంభమైంది. ఆనాడు రైతులుగా ఉన్న వైశ్యులు పంటలలో మెరుగుదలను, మిగులును సాధించారు. ఆర్థిక వృద్ధి కారణంగా వ్యాపారం, ఇతర కార్యకలాపాలు కూడా విస్తరించాయి. ఒకటి లేదా రెండు, మూడు గ్రామాలకు పరిమితమయ్యే పరిస్థితి నుంచి సమాజం బయటపడుతున్నది. ఆనాడు జనపదాలుగా పిలుచుకునే సమా జాలు క్రమంగా చిన్న, పెద్ద రాజ్యాల్లో భాగం కావడం కూడా ప్రారంభ మైంది. రాజులు, రాజ్యాల విస్తరణకు అవకాశాలు పెరిగాయి. కానీ బ్రాహ్మణ పురోహిత వర్గం ఆచరణ ఈ పురోగతికి అడ్డంకిగా మారింది. యాగాల పేరిట వారు విచ్చల విడిగా సాగిస్తున్న కర్మకాండల్లో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పశు సంపదతోపాటు, ధాన్యాలు, నూనెలు, అటవీ సంపదలు అగ్నికి ఆహుతైపోయేవి. క్రతువులు, యాగాలు చేయకపోతే నరక ప్రాప్తి తప్ప దని పురోహిత వర్గం భయపెట్టేది.  

ఆవులు, గుర్రాలు సహా పశుసంపదను ఎంత ఎక్కువగా యాగాల్లో బలిస్తే అంత పుణ్యమనే ప్రచారంతో వ్యాపారులు, వ్యవసాయదారులు, వృత్తిపనివాళ్లు ఆ రోజుల్లో తమ సర్వస్వాన్ని యజ్ఞయాగాలకు కానుకలుగా ఇచ్చి పురోహితులను మెప్పించాలని చూసేవారు. దీంతో వ్యవసాయంలో కీలక భూమికను పోషించే పశుసంపదకు తీవ్ర కొరత ఏర్పడింది. మరోవంక రాజులు సైతం యాగాల కోసం ధనధాన్యాలను, వస్తువులను భారీగా వినియోగిస్తుండటం వల్ల  ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఆ భారానికి కుంగిపోయి వ్యవసాయం, వృత్తులు  సంక్షోభంలో పడే దుస్థితి నెల కొంది. పైగా యాగాల సందర్భంగా మద్యం ఏరులై పారేది. పురోహిత వర్గం సేవించే అత్యంత ఖరీదైన సోమరసం కోసం నిర్వాహకులకు ఖర్చు పెరి గింది. అంతేగాక ఆ మత్తులో పురోహితవర్గం చెప్పరాని జుగుప్సాకరమైన పద్ధతుల్లో విచ్చలవిడి కామకేళిని జరిపేది.

ప్రతిఘటన నుంచి పుట్టిన పంచశీల

‘‘బ్రాహ్మణ పురోహితవర్గపు ఈ అరాచకాలకు ఆది నుంచే అంటే ఋగ్వేద కాలంనుంచే ప్రతిఘటన ఉంది’’ అని రొమిల్లా థాపర్ అన్నారు. చార్వాకులు, లోకాయతులు, అజీవకులు, జైనులు తదితర తాత్విక శాఖలు ఈ తిరుగు బాట్లకు నాయకత్వం వహించాయి. ఇందులో అజీవక సిద్ధాంతాన్ని ప్రతిపా దించి గోశాల, లోకాయుత, చార్వాక సిద్ధాంతకర్త అజిత, అంజనా సిద్ధాంత కర్త సంజయిన్, జైన గురువు మహావీరుడు ముఖ్యులు. ఈ తాత్విక స్రవంతు లన్నీ పురోహిత వర్గం అరాచకాన్ని అడుగడుగునా తిరస్కరించాడు, ప్రతిఘ టించారు. అందుకే వీరిని రాక్షసులని ముద్రవేసి, హతమార్చిన ఘటనలు పురాణాలనిండా కనబడతాయి. భిన్న స్రవంతులుగా సాగుతున్న ఈ పురో హిత వర్గ వ్యతిరేక తాత్విక చింతనలను, ఆచరణలను సమగ్రంగా అర్థం చేసు కున్న గౌతమ బుద్ధుడు శక్తివంతమైన ఆచరణకు కార్యక్రమాన్ని రూపొందిం చారు. పంచశీల పేరుతో రూపొందించిన ఆ కార్యక్రమం ఆనాటి బ్రాహ్మణ పురోహిత వర్గం దురాగతాలకు చరమగీతం పాడింది.

పంచాస్త్రాలుగా పంచశీల

పంచశీలను పలువురు పరిశోధకులు, పండితులు కేవలం వ్యక్తిగత నైతిక విలు వలుగా తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అవి ఐదూ నాటి పురోహితవర్గ దురాచారాలపైకి సంధించిన అస్త్రాలే. మొదటిది, జీవరాశులను నాశనం చేయరాదు, అలాంటి చర్యలకు దూరంగా ఉంటాను. దీని అర్థం ఏ జీవరాశినీ చంపరాదనేదే. కానీ దాని ప్రధాన గురి పశుసంపదను కాపాడుకోవడమే. అంటే యాగాలను వ్యతిరేకించడమే. పైగా బుద్ధుడు అత్యంత నిర్మొహమా టంగా యజ్ఞ, యాగాలను నిరసించాడు. అవి ఆగిపోవడానికి ఆయన చాలా శ్రమించాడు. రెండో అంశం, ఎవరి నుంచీ ఏ వస్తువునూ బలవంతంగా తీసు కోరాదు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. నాటి బ్రాహ్మణ పురోహితవర్గం స్వర్గం, నరకం, పునర్జన్మ, పాపకర్మల పేరిట బెదిరించి బలవంతంగా కానుక లను తీసుకోవడాన్ని ఇది నిరోధించింది. పైగా బుద్ధుడు ప్రత్యామ్నాయ ఆచరణను రూపొందించారు. బౌద్ధాన్ని ఆచరించే భిక్షువులు ఎవరైనాగానీ ప్రజలు ఏది ఇస్తే అదే తినాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు తీసుకోరాదని నిబంధన విధించారు.   పురోహితవర్గం పట్ల విసిగిపోయిన ప్రజలకు సహజంగానే ప్రజల్లో బౌద్ధం పట్ల గౌరవాదరాలు పెరిగాయి. మూడవది, లైంగిక అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదని బుద్ధుడు ప్రబోధించారు.  పురోహిత వర్గం ఆనాడు స్త్రీలపై జుగుప్సాకర కామకేళిని రుద్దిందనడానికి అనేక ఆధారాలున్నాయి. పురోహి తుల ఈ దురాచారాలకు ఈ మూడవ సూత్రం చెంపపెట్టు అయింది.

గృహ స్తులు, చిన్న చిన్న వృత్తి పనివారలు తమ మహిళలకు రక్షణ లభించినందుకు సంతోషించారు. నాలుగవది, తప్పుడు ప్రవచనాలను ప్రచారం చేయవద్దు. అప్పట్లో పురోహితవర్గం దేవుడి పేరుతో, మహిమల పేరుతో ప్రజల అజ్ఞా నాన్ని సొమ్ము చేసుకొని తమ ఆధిపత్యాన్ని, ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకో వాలని చూసింది. బుద్ధుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజలు శక్తివం తులని, వాళ్ల భవిష్యత్తుని వాళ్లే నిర్మించుకుంటారని, అందుకు దేవుడి లాంటి అతీత శక్తులు కారకులు కాదని చాలా కరాఖండిగా చెప్పాడు. ఇక ఐదో అంశం, మద్యం లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండడం. సోమ రస పానం పేరిట పురోహితులు తప్ప తాగి ఎప్పుడూ మత్తులో జోగుతూ సాధారణ ప్రజలనూ అదే దారి పట్టించారు. బుద్ధుని ప్రచారం ప్రజల మత్తును వదిలించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, సమాజానికి, బ్రాహ్మణ పురోహిత వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని గౌతమ బుద్ధుడు తన ఆచరణా త్మక పోరాటంతో పరిష్కరించాడు. దీంతో బ్రాహ్మణ వర్గంలోని పలువురు యోచనా పరులు బౌద్ధాన్ని అనుసరించారు.

సంక్షేమ రాజ్యానికి బాటలు

కుల అసమానతలను కూడా బుద్ధుడు వ్యతిరేకించాడు. బౌద్ధ సంఘాలలో చండాలుల నుంచి బ్రాహ్మణుల వరకు ఒకే రకమైన స్థానం ఉంటుందని ప్రక టించడం గౌతమ బుద్ధుని విప్లవశక్తికి నిదర్శనం. బౌద్ధం విస్తృతంగా వ్యాపిం చడంతో అడ్డంకులన్నీ తొలగి సమాజం పురోగమించింది. ఆ తర్వాత అధికా రంలోకి వచ్చిన సామ్రాట్ అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి, రాజ్యం ప్రజల సంక్షేమానికి పనిచేయాలనే చైతన్యానికి పునాదులు వేశాడు. ఆనాడు సాధారణ ప్రజలు, వ్యాపారులు, బాటసారుల సౌకర్యార్థం ఆయన వేసిన రహదార్లు, చెట్లు నాటడం, బావులు తవ్వించడం ఈ రోజు మనకు చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ ఆ రోజు అవి విప్లవాత్మక పరిణా మాలే. కాబట్టే అశోకుడి ప్రజారంజక పాలన నేటి  ప్రభుత్వాలకు కూడా ఆద ర్శంగా నిలుస్తోంది.

ఆ విలువల ప్రాధాన్యతను మనం గుర్తించాలి. మార్పు భౌతిక సూత్రం. విప్లవకర పరిస్థితులు పరిణామాత్మక, గుణాత్మక మార్పు లకు దారితీస్తాయి. ప్రజలకు, వారి ప్రయోజనాలకు సంబంధంలేని ఏ ఆచా రాలైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఆ మార్పుకి ఒక్కో కాలంలో, ఒక్కో పద్ధతిలో తిరుగుబాటు అనివార్యం. తరతమ స్థాయిల్లో జరిగే తిరుగుబాట్లు ఒక ఉన్నతమైన, చైతన్యవంతమైన నూతన సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ నేపథ్యం నుంచే బౌద్ధాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే భారత సామాజిక చరిత్రలో బౌద్ధం తొలి విప్లవం.  (మే 4 బుద్ధ జయంతి సందర్భంగా) (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ నం : 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement