కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు | By the evidence of cartoons | Sakshi
Sakshi News home page

కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు

Dec 15 2014 1:08 AM | Updated on Dec 25 2018 2:55 PM

కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు - Sakshi

కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు

నేడు ప్రముఖ చిత్రకారుడు బాపు జయంతి. ఈ సందర్భంగా ఈ గీతం ఆయనకు అంకితం

కార్టూన్లు కదిలే బొమ్మలు
 కార్టూన్లు మదిలో బొమ్మలు
 కార్టూన్లు పలికే కొమ్మలు
 కార్టూన్లు కదిలే రెమ్మలు
 
 కార్టూన్లు కదిలించే అమ్మలు
 కార్టూన్లు చేయందించే తమ్ముళ్లు
 కార్టూన్లు నడక నేర్పే నాన్నలు
 కార్టూన్లు కళ్లు తెరిపించే భార్యలు
 
 కార్టూన్లు కాలానికి సాక్ష్యాలు
 కార్టూన్లు వెన్నుతట్టే మిత్రులు
 కార్టూన్లు కంటిలో ఒత్తులు
 కార్టూన్లు ప్రజల చురకత్తులు
 
 కార్టూన్లు కారుచీకట్లో దివిటీలు
 కార్టూన్లు మండుటెండల్లో మంచుకొండలు
 కార్టూన్లు నిద్రలేపే కొక్కొరోకోళ్లు
 కార్టూన్లు జడివానలో మెరుపులు
 కార్టూనిస్టులు ప్రగతిరథ చక్రాలు
 కార్టూనిస్టులు సమాజ ఉచ్చ్వాశ నిశ్వాసాలు
 కార్టూనిస్టులు జాతి జవసత్వాలు
 కార్టూనిస్టులు నిత్య సత్యాన్వేషులు.
 
(నేడు ప్రముఖ చిత్రకారుడు బాపు జయంతి. ఈ సందర్భంగా ఈ గీతం ఆయనకు అంకితం)
 - డా॥కూటికుప్పల సూర్యారావు  విశాఖపట్నం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement