‘కస్టడీ’ కథలు కంచికి వెళతాయా? | 'Custody' stories will go to Kanchi? | Sakshi
Sakshi News home page

‘కస్టడీ’ కథలు కంచికి వెళతాయా?

Published Mon, Nov 10 2014 11:32 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

‘కస్టడీ’ కథలు కంచికి వెళతాయా? - Sakshi

‘కస్టడీ’ కథలు కంచికి వెళతాయా?

కస్టడీలో ఉన్న వ్యక్తులను విడుదల చేసినట్టు చూపించి, నకిలీ హత్యలతో పోలీసులు వారిని ఎలా వదిలించుకుంటున్నారో సింఘ్వీ వెల్లడిస్తూ, ఇలాంటి హత్యలను నిరోధించడానికి ఎలాంటి సంస్కరణలను పోలీసు వ్యవస్థలో ప్రవేశపెట్టాలో కొన్ని సూచనలు చేశారు. కస్టడీలో ఉండగానే పోలీసుల చిత్రహింసలకు గురవుతున్న వ్యక్తుల పరిస్థితి గురించీ, అర్ధాంతరంగా పోలీసులు అంతం చేసిన వ్యక్తుల కుటుంబాల బాధల గురించీ ఆ పత్రంలో సింఘ్వీ పేర్కొన్నారు. అయితే ఇది ఒక్క పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమస్యగా మాత్రమే మిగిలిపోరాదని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాగూర్ అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం భావించింది.
 
‘‘కస్టడీలో ఉన్న వ్యక్తిని విడుదల చేసినట్టు పోలీసు రికా ర్డులలో చూపించినట్టే చూపించి తరువాత ఆ వ్యక్తిని అడ విలోకో లేదా మరో రహస్య స్థలానికో తీసుకుపోయి హత మారుస్తున్న మాట నిజమే!’’
 (సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారు, ప్రసిద్ధ న్యాయవాది అఖిషేక్ మను సింఘ్వీ ప్రత్యేక వివరణ పత్రం నుంచి)

మను సింఘ్వీ ఈ పత్రాన్ని  సమర్పించడానికి ఒక రోజు ముందు (4.11.2014) శ్రీనగర్‌లోని భత్తారామ్‌కు మొహరం కోసం  వెడుతున్న ఫైజల్, మెహ్రాజుద్దీన్ అనే ఇద్దరు సాధారణ యువకులు సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించారు. ఈ అకారణమైన కాల్పులకు, హత్యాకాం డకు లోయ నిర్ఘాంతపోయింది. శ్రీనగర్‌లోని అనేక ప్రాం తాలలో కర్ఫ్యూ విధించవలసిన పరిస్థితి ఏర్పడింది.
 
ఇన్నేళ్లకైనా గుర్తుకొచ్చింది!

ఇలాంటి సైనిక చర్యలు జమ్మూ-కాశ్మీర్‌కు కొత్తేమీకాదు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం అరవై ఐదేళ్లుగా కాశ్మీ రీలు  జరుపుతున్న ఆందోళనోద్యమాలూ, సైనిక ఘర్షణ లూ అందరికీ తెలిసినవే. కాని ఇతర ప్రాంతాలలో, రాష్ట్రా లలో ప్రజాసమస్యలపైన వివిధ రాజకీయపక్షాలూ, మిలి టెంట్ శక్తులూ నిర్వహిస్తున్న ఉద్యమాలు, పోరాటాల సం దర్భంగా కూడా కొందరు నాయకులనూ, పార్టీల మిలి టెంట్ కార్యకర్తలనూ ఎన్‌కౌంటర్ల పేరిట పోలీసు, భద్రతా యంత్రాంగం పరిమార్చడం జరుగుతోంది. అనుమానం మిషతో లెక్కకుమించి యువకులను ఇళ్ల నుంచి అర్ధరాత్రి తీసుకెళ్లి కాల్చి చంపి, ఎదురు బొదురుకాల్పులలో చనిపో యారని చెప్పడమో, లేదా కస్టడీ నుంచి తప్పించుకుపో యారని కథలల్లి ఖతం చేయడమో జరుగుతోంది. ఈ ఘటనలను నిజాలుగానో, నమ్మలేని నిజాలుగానో ఇంత కాలం ప్రజలు భావిస్తూవచ్చారు. న్యాయస్థానాలు సహి తం ఎటూ తేల్చుకోలేకపోతున్న సందిగ్ధ స్థితినీ చూస్తు న్నాం. ఈ అయోమయస్థితిలో పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు లేదా వ్యక్తులు ఉన్నట్టుండి ‘మాయ’మై, ఆపై నకిలీ కాల్పులలో ఎలా చనిపోతున్నారన్న రహస్యాన్ని రాబట్టాలని సుప్రీంకోర్టు భావించింది.
 
‘డి.కె.బసు-పశ్చిమబెంగాల్’ (1997) కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాని(పిల్)కి సంబంధించి సుప్రీంకోర్టు తనకు సాయపడవలసిందిగా కోరుతూ సింఘ్వీని ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. తమ కస్టడీలో ఉన్న వ్యక్తు లను విడుదల చేసినట్టు చూపించి, నకిలీ హత్యలతో పోలీ సులు వారిని ఎలా వదిలించుకుంటున్నారో సింఘ్వీ వెల్ల డిస్తూ, ఇలాంటి హత్యలను నిరోధించడానికి ఎలాంటి సంస్కరణలను పోలీసు వ్యవస్థలో ప్రవేశపెట్టాలో కొన్ని సూచనలు చేశారు. కస్టడీలో ఉండగానే పోలీసుల చిత్ర హింసలకు గురవుతున్న వ్యక్తుల పరిస్థితి గురించీ, అర్ధం తరంగా పోలీసులు అంతం చేసిన వ్యక్తుల కుటుంబాల బాధల గురించీ ఆపత్రంలో సింఘ్వీ పేర్కొన్నారు. అయితే ఇది ఒక్క పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమస్యగా మాత్రమే మిగిలిపోరాదని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాగూర్ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం భావించింది. దీనితో దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి కస్టడీ, నకిలీ హత్యలకు సంబంధించిన వివరాలను పొందుప రిచి, వాటిపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను సమీ కరించుకుని తగిన సిఫారసులతో సమగ్ర నివేదికను ఇవ్వమని సింఘ్వీని కోరింది. దానిపై కూడా  సింఘ్వీ నివేదికను రూపొందించారు. కస్టడీలో ఉన్న పౌరులను విడుదల చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి, ఏ అడవికో లేదా నిర్ణీత రహస్య ప్రదేశానికో తీసుకుపోయి హతమా ర్చిన  ఘటనలు ఆయా రాష్ట్రాలలో జరిగాయని సింఘ్వీ పేర్కొన్నారు. ఇంత జరిగినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఘట నలను ‘కస్టడీ హత్యలుగా పేర్కొనకపోవడం’ ఆశ్చర్య కరమని సింఘ్వీ శఠించవలసి వచ్చింది.
 
సింఘ్వీ సిఫారసులు ఇవీ

పోలీసు కస్టడీలో జరిగిన హత్యలలో భాగంగానే, అలాంటి నకిలీ హత్యలన్నింటినీ కస్టడీ నుంచి విడుదలైన 24 లేదా 48 గంటలలోపే జరిగినట్టు నమోదు చేస్తూ ‘కస్టడీ హత్య’ వ్యవధిని నిర్ధారణ చేయాలని సుప్రీం సలహాదారైన న్యాయవాది సిఫారసు చేశారు! ఒకసారి ప్రాథమిక విచార ణలో నకిలీ హత్య లేదా అశ్రద్ధ వల్ల జరిగిన హత్య అనో నిర్ధారణ కాగానే పోలీసు అధికారులపైన క్రిమినల్ ప్రొసీ డింగ్స్ వెంటనే ప్రారంభించాలని కూడా సిఫారసు చేశారు. అలాగే మానవ హక్కుల పరిరక్షణ చట్టం (1993)లోని సెక్షన్-30 ఆధారంగా జిల్లాలో మానవ హక్కుల న్యాయ స్థానాలను మూడు నెలల్లోనే ఏర్పాటు చేయాలనీ, కోర్టు అధికారుల సంఖ్య చాలకపోతే సదరు కోర్టులలో ఆ సం ఖ్యను వెంటనే పెంచాలని సంఘ్వీ సిఫారసు చేశారు. ఈ సిఫారసులు  బాగానే ఉన్నట్టు పైకి కనిపించవచ్చు. కాని అరుదైన సందర్భాలలో తప్ప జాతీయ, రాష్ట్రస్థాయి ‘మాన వహక్కుల పరిరక్షణ  న్యాయస్థానాలు’ అనేక సందర్భా లలో చట్టాన్ని అమలు చేస్తూ జారీ చేసిన పెక్కు ఉత్తర్వు లను, తాఖీదులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బుట్టదా ఖలు చేస్తూండటం దేశ పౌరుల అనుభవం! ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్రంలోని మానవ హక్కుల పరిరక్షణకు ఏర్ప డిన కోర్టు సహా పెక్కు న్యాయస్థానాలను ఆయా రాష్ట్రాల పాలక పక్షాలు ‘తు.న. బొడ్డు’ కింద జమకడుతూ తప్పిం చుకు తిరుగుతున్నాయని మరచిపోరాదు.
 
అందలాల నిండా గురివిందలే

స్విట్జర్లాండ్‌లోనూ, తదితర డజన్ల కొద్దీ దేశాలలోని బ్యాం కుల్లోనూ మూలుగుతున్న 24 లక్షల కోట్ల రూపాయల అక్రమ (దొంగ) సొమ్మును తిరిగి దేశానికి తెస్తామని పైకి ప్రగల్భాలు పలుకుతున్న పాలకుడు నరేంద్రమోదీ ఆచర ణలో ‘గురివింద గింజ’ సామెతగానే  వ్యవహరిస్తున్నారు. స్వపక్షం బీజేపీలోని నేరగాళ్లనూ, అవినీతిపరులనూ ఎండగట్టలేకపోతున్నారు. ఆ మాటకొస్తే-2002లో గుజరా త్‌కు చెందిన 2000 మంది మైనారిటీల ఊచకోతల సంద ర్భంగా వచ్చిన హత్యారోపణల నుంచి ముఖ్యమంత్రి హోదాలో గుజరాత్ కోర్టుల నుంచి వెసులుబాటు పొందు తూ వచ్చినా సుప్రీంకోర్టుకు ఎక్కిన తీవ్రమైన కేసు నుంచి మోదీ పూర్తిగా బయటపడలేదు! ఈ విషయాన్ని, ‘సిట్’ కార్యకలాపాలనీ ఒక కంట కనిపెట్టమని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక సలహాదారు (ఎమికస్ క్యూరీ) రాజు రామచంద్రన్ చేసిన ఒక ప్రకటనను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 2002 నాటి ఘనటల్లో మోదీ నిర్దోషి త్వంపై సుప్రీంకోర్టు తన తుదిమాటను ఇప్పటికీ వెలు వరించలేదు, తుది తీర్పు ఇంకా రావలసే ఉందని మరొక వైపున రాజు రామచంద్రన్ అభిప్రాయపడుతున్నారని మరచిపోరాదు. అలాగే బీజేపీ పాలనా యంత్రాంగంలో సన్నిహిత భాగస్వామి అయిన అమిత్‌షా కూడా షొరా బుద్దీన్ దంపతులు ఎన్‌కౌంటర్‌లో మరణించడానికి ప్రధా న కారకుడన్న ఆరోపణ నుంచి బయటపడలేదు.  ఇలా వాడవాడలా  మైనారిటీలను వేధిస్తూ, అమాయకుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూ, అయినా తప్పిం చుకు తిరు గుతూ, నిరాటంకంగా అందలాలకు ఎగబాకు తున్న వారు స్వేచ్ఛగా ఉన్నంత కాలం దేశంలోని న్యాయవ్యవస్థలు, వాటి తీర్పులు, గౌరవ ప్రతిష్టలు నామమాత్రంగానే మిగిలిపోతాయి.
 
అక్కడ ఏం జరుగుతోంది?


ఈ విషయంలో అమెరికా సుప్రీం కోర్టు వ్యవహరిస్తున్న తీరును గుర్తుకు తెచ్చుకోవాలి. పాలకుడు ఏ స్థాయివా డైనా, ఎంతటి వాడైనా అమెరికన్ సుప్రీంకోర్టు సహించ కుండా శిక్షలకు పాత్రులను చేస్తుంది. ‘పెంటగాన్ పత్రాల’ వెల్లడి విషయంలో, వియత్నాంపై దురాక్రమణ యుద్ధ సమయంలో, అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ చర్యలను బట్ట బయలు చేసిన పత్రికల సంరక్షణకు నడుం బిగించడంలో అమెరికా సుప్రీంకోర్టు పాత్ర విశిష్టమైనది. పాలకుల పదవీ భ్రష్టతకు దారితీసి, పత్రికా స్వేచ్ఛను ప్రదీప్తం చేసి న ఘనత అమెరికా సుప్రీంకోర్టుదే! మన దేశంలో సుప్ర సిద్ధ న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఒ.చెన్నప్పరెడ్డికి ఇక్కడ పోలీసులు బనాయించే ఆరోపణల ఆధారంగా పౌరులపై జరిగే చిత్రహింసలనూ, నకిలీ ఎన్‌కౌంటర్లనూ నాగరిక సమాజానికి తలవంపులుగా భావించి తీర్పు లిచ్చిన ఘనత ఉంది. ‘జీవించే హక్కును పౌరుడికి గ్యారంటీ చేసిన’ రాజ్యాంగానికి ఇలాంటి చర్యలు అపవా దులుగా మిగిలిపోతాయని పేర్కొంటూ అనేక కేసులపై ఇచ్చిన తీర్పులలో వ్యాఖ్యానించిన కీర్తి కూడా ఆయనకు ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) సుద ర్శన్‌రెడ్డి ఛత్తీస్‌ఘడ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్లలో మావోయి స్టులను పరిమార్చడం గురించి ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. పరిపాలన పేరుతో సమాధుల నుంచి కూడా అధికారం చెలాయించాలనుకొనే పాలకులున్న చోట ప్రజలకు సుఖ శాంతులుండవు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement