అహం చేతికి ఆత్మగౌరవం
విశ్లేషణ
వాస్తు పిచ్చితో సచివాలయం, హైకోర్టు భవనాలు దూరంగా, అసాధారణ రీతిన నిర్మించబూనుకోవడం, అహంభావాన్ని, అశాస్త్రీయ ఆచరణను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీల, పోరాటాల నాయకులను గౌరవించ నిరాకరించడం భూస్వామ్య దురహంకారమే.
ప్రత్యేక తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర పట్ల భిన్నాభిప్రా యాలు ఉండాల్సిన పనిలేదు. కానీ టీఆర్‌ఎస్, కేసీఆర్ వల్లనే ఆ కల సాకారం కాలేదు. అనేక మంది విద్యార్థి, యువకుల ఆత్మబలిదానాలు, జేఏసీ వివి ధ వృత్తి సంఘాల ప్రజలు, సీపీఐ, న్యూడెమోక్రసీ లాంటి పార్టీలు గొప్ప పాత్ర వహించాయి. కేసీఆర్ జూన్ 2న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాది పాలన మీద, వాస్తవం చెప్పాలంటే సర్వత్రా అసంతృప్తి పెరుగుతున్నది. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తే హైకోర్టు తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విద్యుత్ కేటాయింపులు అమలు కాలేదు. నీటి కేటాయింపుల వివాదం-2014 కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లాలోని పోలవరంలో ముంపునకు గురికాని 7 మండలాలను ఏక పక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మిగతా ప్రతిప క్షాల లాగానే బంద్‌కు పిలుపిచ్చి చేతులు దులుపుకున్నా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చి పుచ్చు కునే ధోరణిలో వ్యవహరించాల్సి ఉండగా తగాదాలు పెరిగిపోతున్నాయి.కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది.
మంత్రివర్గం 43 అంశాల మీద తీర్మానాలు చేసిన ప్పటికీ అమలు తూతూ మంత్రంగా ఉన్నది. సీఎం కనుసన్నలలోనే పాలన సాగుతూ, ఇద్దరు, ముగ్గురు మంత్రులు మాత్రమే కొంతమేరకు స్వతంత్రంగా నడుస్తున్నారు. ప్రతిపక్షాల ఎంఎల్‌ఏలను ఫిరాయింపు లకు ప్రోత్సహిస్తున్నారు. విమర్శల పట్ల, భిన్నాభిప్రా యాల పట్ల అసహనం మరో దుర్లక్షణం. వాస్తుపిచ్చితో సచివాలయం, హైకోర్టు భవనాలు దూరంగా, అసాధా రణ రీతిన నిర్మించబూనుకోవడం, అహంభావాన్ని, అశా స్త్రీయ ఆచరణను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీల, పోరా టాల నాయకులను గౌరవించ నిరాకరించడం భూస్వా మ్య దురహంకారమే. రూ.లక్ష వరకు రుణమాఫీ ప్రక టించి కాలపరిమితికి లింకు పెడితే రైతులు కన్నెర్ర చేయ డంతో వైఖరి మార్చుకొని అమలుకు పూనుకున్నారు. అయినా రైతు ఖాతాలో ఉన్న అప్పుకు వడ్డీ పడుతున్నది. కొత్త పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఇబ్బం దులు కలిగిస్తున్నాయి. విద్యుత్ మొదట్లో సరిగా రాలేనం దున, రైతులు ఆందోళన బాటపట్టారు. అప్పుడు సర్దుకు న్నారు. కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వా నికి నివేదించడంలో విఫలమైనారు. రైతుల ఆత్మహ త్యల గురించి పట్టించుకోవలసిందని వామపక్షాలు, ప్రతి పక్షాలు ఆందోళనలు చేసినా ఫలితం లేదు.
భూమి ప్రధాన ఎజెండాగా ఉన్నది. రెవెన్యూ చట్టా లు లోపభూయిష్టంగా ఉన్నాయి. సర్వే నంబర్ల హద్దులు సరిగా లేవు. దళితులకు మూడెకరాలు కొనుగోలు చేసి ఇవ్వడం ఆర్థిక భారం, అందువలన గత చట్టాలకు సవర ణలు తెచ్చి భూసేకరణ చేసి పంపిణీ చేయడానికి అవ కాశముందంటే కూడా పట్టించుకునే స్థితి లేదు. మొదటి ఏడాది 1,000, రెండవ సంవత్సరం 1,000 కోట్లు కేటా యించారు. 10 లక్షల ఎకరాల పైబడి కొనుగోలు చేసి ఇవ్వవలసిన చోట 10 వేల ఎకరాలు కూడా సమకూర్చ లేదు. ఎన్ని సంవత్సరాలలో ఎస్‌సీ, ఎస్‌టీలకు భూమి కొని ఇస్తారో తేల్చి చెప్పాల్సి ఉన్నది. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అంశం ప్రస్తావనే వినిపించడం లేదు. రేషనలైజేషన్ పేరుతో 3 వేలపై బడి పాఠశాలలు మూత పడనున్నాయి. యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వైస్ చాన్సలర్ల, కమిటీలు లేవు. ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహ రిస్తున్నది. వైద్యవిద్య, సాంకేతిక విద్య పట్ల శ్రద్ధ కనబ రచాలి. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వానికి ఒక జలవిధానం లేదు. పాత ప్రాజెక్టులను పక్కనపెట్టి కొత్త ప్రాజెక్టులు పాల మూరు-రంగారెడ్డి, జూరాల-పాకాల, నక్కలగండి ఎత్తి పోతల పథకాలు చేపడతామంటున్నారు. ప్రాణహిత- చేవెళ్ల అలైన్‌మెంట్ మార్చి కాళేశ్వరం నుండి వంపులో రిజర్వాయర్ నిర్మిస్తానని, సర్వేకు ఉత్తర్వులిచ్చారు. ఆది లాబాద్ జిల్లా ప్రజలకు గుండుసున్న పెట్టే పరిస్థితి కన బడుతున్నది. చెరువులలో పూడిక తీసే పథకం కొత్తది కాదు. కాని ప్రచారం బాగా చేస్తున్నారు. ఒకేసారి కేంద్రీ కరించి, పనులు స్పీడుగా సాగడానికి ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకున్నది. ఇది మంచి పరిణామం. దీనిలో అవినీతి జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
జీఓ 58, 59లను విడుదల చేసినా ఒక్కరికి పట్టా సర్టిఫికెట్ ఇవ్వలేదు. డబుల్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్ అని ఉవ్విళ్లూరించి ఒక కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వ కాలంలోని వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న 5 లక్షల ఇళ్ల బిల్లులు చెల్లింపులకు సీఐడీ విచారణ పేరుతో నిలిపివేశారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థలో, ఆచరణలో మార్పు రావాలి. ప్రజాస్వామ్య సంప్రదాయాలు పునరుద్ధరించాలి. ఈ లక్ష్యాల సాధనకు మరో పోరాటానికి మన సిద్ధపడాలి. ప్రజా తెలంగాణ నిర్మాణానికి ప్రథమ వార్షికోత్సవ వేళ చేసే ప్రతిన ఇదే.
(వ్యాసకర్త: కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సమితి)
మొబైల్: 9490952301
చాడ వెంకటరెడ్డి