
మూడేళ్లలో ఏం మారలేదు: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా రాష్ట్ర పరిస్థితి, ప్రజల స్థితిగతుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
బుధవారం సీపీఐ నగరకౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాల్ని కూడా అమలు చేయకుండా సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టడానికి రోజుకో ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.