
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బలముందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే నిజమైతే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.
ప్రతిపక్షపార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు, అనర్హత పిటీషన్లు ఏళ్ల తరబడి ఎందుకు పెండింగులో పెట్టారని ఓ లేఖలో ప్రశ్నించారు. సమ్మె చేస్తే ఆర్టీసీలోని 53 వేల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతా యని సీఎం కేసీఆర్ హెచ్చరించడం తగదని, తమిళనాడులో ఉద్యోగాలు తొలగించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికల్లో ఏ గతి పట్టిందో గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment