ఈజిప్ట్‌లో ‘ఫారో’ పునరుత్థానం! | Egypt towards to Civil War | Sakshi
Sakshi News home page

ఈజిప్ట్‌లో ‘ఫారో’ పునరుత్థానం!

Published Tue, Aug 20 2013 2:21 AM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

ఈజిప్ట్‌లో ‘ఫారో’ పునరుత్థానం! - Sakshi

ఈజిప్ట్‌లో ‘ఫారో’ పునరుత్థానం!

 ఈజిప్ట్ అంతర్యుద్ధం దిశగా పయనిస్తోంది. అల్‌కాయిదాకు పట్టున్న సినాయ్‌లో మిలిటెంట్ల దాడిలో 25 మంది పోలీసులు మరణించడం దానికి నాంది.
 
 ‘ఈజిప్ట్‌ను నాశనం చేయాలని భావిస్తున్న వారి పట్ల ఇంకా సంయమనాన్ని పాటించలేం. వాళ్లు దేశాన్ని నాశనం చేస్తుంటే చేతులు ముడుచుకు కూచునేదిలేదు. దాడులకు పాల్ప డుతున్నవారిని ఇక మా బలగాల పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటాం’ అని ఈజిప్ట్ ఆర్మీ చీఫ్, రక్షణ మంత్రి జనరల్ అబ్దుల్ ఫతా అల్ సిసీ సోమవారం ప్రకటించారు. ఈ నెల 14న రాజధాని కైరోలో రెండు వేలకు పైగా ముస్లిం బ్రదర్‌హుడ్ అసమ్మతివాదులను ఊచకోత కోసిన తర్వాత ఆయన ఆ ఘటనపై  చేసిన మొట్టమొదటి ప్రకటన ఇదే. గత నెల 3న సైనిక తిరుగుబాటుతో అధికారం చేజిక్కిం చున్న సిసీ ఇకపై ‘సంయమన ం’ పాటించక, పీనుగుల పిరమిడ్లను నిర్మిస్తారు. రెండున్నరేళ్ల క్రితం అరబ్బు విప్లవవెల్లువకు కొట్టుకుపో యి కటకటాలు లెక్కిస్తున్న మాజీ నియంత హోస్నీ ముబారక్ త్వరలో విడుదల కానున్నారనే ప్రకటన కూడా సోమవారమే వెలువడ టం కాకతాళీయం కాదు. అభినవ ఫారో నిన్నటి ఫారోకు ఇస్తున్న కానుక ఇది.
 
 సైనిక తిరుగుబాటు జరిగిన రోజే సిసీ, అమెరికా విదేశాంగ మంత్రి చుక్ హ్యాగెల్‌తో ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు. ఆనాడు, ఆ తర్వాత సాగుతున్న హింసాకాండపై అమెరికా కోరి నది, కోరుతున్నది ఒక్కటే... సంయమనం! సిసీ తొలిరోజు నుంచే అమెరికా మాటను పెడచెవిని పెట్టి నిరసనకారులపై హత్యాకాం డ సాగిస్తున్నారు. సిసీ సైనిక ప్రభుత్వంతోపాటూ, కూలిన మొర్సీ ప్రభుత్వం కూడా అమెరికా నిలిపినవే. కాబట్టి ఈజిప్ట్‌లో అమెరికా విధానం... అటైనా ఇటైనా గెలుపు తమదేననే స్థితిలో ఉండాల్సింది. అలాంటిది అటు ఇటూ ఎటైనా ఓటమి తప్పదేమోనని భయపడాల్సిన స్థితిలో పడింది. అందుకే ఈజిప్టులో సైనిక కుట్ర జరిగిందనే సాహసం చేయలేకపోతోంది. సిసీ ‘సంయమనం’ కోల్పోయాక కూడా ఏమీ చేయలేని దుస్థితి దానిది.
 
 తెరవెనుక సాగుతున్న నాటకీయ పరిణామాల ఫలితమిది. సరిగ్గా సైనిక కుట్రకు ముం దు సిసీ చివరిసారిగా మొర్సీని అధికారం వదులుకోవాలని హెచ్చరించారు. తనకు అం తర్జాతీయ మద్దతు ఉన్నదని, అమెరికా చూస్తూ ఊరుకోదని మొర్సీ ధీమా వ్యక్తం చేశారు. మొర్సీ అంచనాలు తప్పాయి. ‘అంతర్జాతీయ మద్దతు’ ఉన్నది సిసీకే! సైనిక తిరుగుబాటు నాటికే ఈజిప్ట్ ఆకలితో అలమటిస్తోంది. పేదలు నెలల తరబడి ప్రభుత్వం సబ్సిడీకి అందిస్తున్న రొట్టెతోనే గడుపుతున్నారు. సిసీ అధికారం చేజిక్కించుకున్న వెం టనే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ ఎమిరేట్స్ (యూఏఈ) 1,200 కోట్ల డాలర్ల తాత్కాలిక సహాయాన్ని ప్రకటించాయి. సౌదీ తోపాటూ ఇజ్రాయెల్ సైతం సిసీకి మద్దతు పలుకుతోంది.
 
 ఈజిప్టు-ఇజ్రాయెల్ క్యాంప్ డేవిడ్ ఒప్పందాన్ని సిసీ అంగీకరిస్తారు, మొర్సీ అంగీకరించరు. అమెరికా ఈ  ఇద్దరు మిత్రులతో కలిసి ‘దుష్ట కూటమి’కి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. బుధవారం నరమేధానికి సరిగ్గా రెండురోజుల ముందు అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ చైర్మన్ జనరల్ మార్టిన్ డెంప్సీ ఇజ్రాయెల్ వెళ్లి ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కలిశారు. ‘ఈ ప్రాంతం నుంచి తలెత్తుతున్న ముప్పులను ఎదుర్కొని ఇరు దేశాలకు మరింత భద్రత చేకూరేట్టు చేయడం’ కోసం చర్చలు జరి పారు. ఆ ముప్పు ఇరాన్, సిరియా, లెబనాన్‌ల సరికొత్త ‘దుష్ట కూటమి’ నుంచేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మోషె యాలాన్ బహిరంగంగా ప్రకటించారు. సౌదీ, ఇజ్రాయెల్ రెం డూ ఆ ‘దుష్ట కూటమి’కి వ్యతిరేకమే.
 
  అలా ఏర్పడ్డ ఆ ఐక్యత సిరియా తిరుగుబాటుదార్లకు సహాయం నుంచి ఈజిప్టు సైనిక తిరుగుబాటు వరకు దినదిన ప్రవర్థమానమవుతోంది. అది అమెరికాకే భయం కలిగించేంతగా బలపడుతుండటం దానికి మింగుడు పడటం లేదు. మొదటి దఫా అధ్యక్షునిగా విదేశాంగ విధాన అధ్యక్షునిగా పేరుతెచ్చుకున్న ఒబామాకు రెండో దఫా ‘విధి’ వక్రీకరించింది. అడుగడుగునా వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈజిప్టుతో కలిసి  సైనిక విన్యాసాలను నిలిపివేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించిన వెంటనే... రష్యా అధ్యక్షుడు వ్లది మిర్ పుతిన్ ఈజిప్టుకు సైనిక సహాయాన్ని అందిస్తామంటూ ముందుకొచ్చారు. అన్వర్ సాదత్ హయాంలో రష్యాతో తెగదెంపులు చేసుకున్న ఈజిప్టుతో ఇప్పుడు మళ్లీ రష్యా నెయ్యం మొదలైంది.
 
 మరోవంక సౌదీ, రష్యానుంచి 15 బిలియన్ డాలర్ల ఆయుధాలను కొనడానికి శనివారం ఒప్పందం కుదుర్చుకుం ది. అది ఇప్పటికే చైనా నుంచి కొన్న క్షిపణులను ఇరాన్‌పైకి గురిపెట్టింది. ఇజ్రాయెల్ అం దించిన అణుబాంబులను వాటికి జోడించిం దని కూడా వినవస్తోంది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్యాల క్రీడ రసవత్తర ఘట్టానికి చేరిం ది. ఇజ్రాయెల్-సౌదీ-అమెరికా కూటమి ఒకపక్క ఉండగానే మరోపక్క ఇజ్రాయెల్-సౌదీ-రష్యా-చైనాల కూటమి రూపుదిద్దుకుం టోంది. ఆ రెండు కూటములు సిసీ నరహం తక ఫారో పాలనకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈజిప్టు అనివార్యంగా అంతర్యుద్ధం దిశగా పయనిస్తోంది. అల్‌కాయిదాకు పట్టున్న సినాయ్ ద్వీపకల్పంలో మిలిటెంట్ల దాడిలో 25 మంది పోలీసులు మరణించడం దానికి నాంది కావచ్చు.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement