ఇద్దరూ ఇద్దరే అయినా ఎవరి దారి వారిదే
అవలోకనం
ట్రంప్, మోదీలు ఇద్దరూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చినవారే. ఒకరు మూడేళ్లుగా పదవిలో ఉండగా, మరొకరు మూడు నెలలుగానే పదవిలో ఉన్నారు. ట్రంప్ పేరు అప్పుడే వైఫల్యంతో ముడిపడిపోయింది. మోదీ కూడా తప్పులు, అతిగా వాగ్దానాలు చేశారు. కానీ ఆయనది జాగరూకతతో వ్యవరించే వైఖరి. అదే ఆయనను విమర్శల నుంచి కాపాడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం కోసం గత ఏడాది సాగించిన ఎన్నికల ప్రచారంలో అతి గొప్ప వాగ్దానాలు కొన్ని చేశారు. ‘బురద నేలలోని బురదనంతా తోడిపారేస్తాను’ అనేది వాటిలోకెల్లా అత్యంత ఆసక్తికరమై నది. వాషింగ్టన్‌ను ప్రక్షాళన చేస్తానని దాని అర్థం (ఆ నగరాన్ని నిర్మించినది చిత్తడి నేలలోనే అని నమ్మిక). పరిపాలనలోగానీ లేదా రాజకీయాల్లోగానీ ట్రంప్‌కు ఎలాంటి సమర్థతా ఉన్నట్టు కనిపించని నేడు ఆయన ఆ పని చేస్తారనడం హాస్యా స్పదం అనిపిస్తుంది. ఆయనను ఓ విధమైన మేధావిగా చూపుతూ ప్రచారం సాగించారు. అధ్యక్షునిగా ఆయన తన తొలి కొన్నినెలల కాలంలో విదూషక వ్యక్తిత్వంగలవానిగా, గర్విౖయెన కోపిష్టిగా, తన పాలనా యంత్రాంగంపై కనీస నియంత్రణనైనా నెరపలేని వారుగా బహిర్గతమయ్యారు. మామూలుగానైతే అది కనబడేది కాదుగానీ ట్రంప్ నిత్యం తప్పక ట్వీట్ చేయడం, ఆయన లోపభూయి ష్టమైన నడవడికను పెద్దదిగా చేసింది. నిరంతరాయంగా, మహోత్సాహంగా ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేస్తూ (ఆశ్చర్యార్థకాలను వాడటం అంటే ఆయనకు మహా ఇష్టం)... తన పేరు ప్రతిష్టలను పరిరక్షించే విధులలో ఉన్నవారికి క్లిష్ట పరిస్థితులను కలిగిస్తుంటారు.
ఇక్కడ ట్రంప్‌కు, మన ప్రధాని నరేంద్రమోదీతో పోలిక ఉంది. మోదీకి కూడా ట్వీటర్‌ను వాడటం అంటే ఇష్టం. అయితే ఆయన ఆ పనిని ట్రంప్ కంటే భిన్నంగా చేస్తుంటారు. ఇద్దరికీ మూడు కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇద్దరిలో ఎవరూ పాత్రికేయులను నమ్మరు కాబట్టి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఓటర్లతో మాట్లాడతారు. ప్రత్యర్థులు, మీడియా తన పట్ల అన్యాయంగా ప్రవర్తించారనీ, తన మేధోశక్తిని గుర్తించలేదు లేదా ప్రశంసించలేదనీ ట్రంప్ నమ్ముతారు. ఇక మోదీ, తాను ఏ తప్పూచేయకపోయినా, మతపరమైన హింసకు సంబంధించిన తన చరిత్రను తనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని భావిస్తారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక సాగిన సామాజిక మాధ్యమాల వృద్ధి... తనకు ప్రజలకు మధ్య ఉన్న మీడియా అనే పొరను తొలగించుకునే అవ కాశాన్ని కల్పించింది. ఆ పనిని ఆయన అత్యంత సమర్థవంతంగా చేశారు. ట్వీటర్ ఆవిర్భవించే వరకు ఆయన నిరంతరాయంగా పాత్రికేయులతో ఘర్షణ పడుతూనే ఉండేవారు (కరణ్ థాపర్‌తో లైవ్‌గా సాగుతున్న ఒక ఇంటర్వూ్య నుంచి ఆయన లేచి వెళ్లిపోయారు). ట్రంప్‌లాగే ఆయన కూడా అంత కోపానికి, చికాకుకు గుర య్యేవారని ఇది తెలుపుతుంది. అయితే మోదీ అలాంటి సందర్భాల్లో ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తారు.
ఇద్దరూ ట్వీటర్‌ను ఉపయోగించే పద్ధతిలో తేడాలకు సంబంధించి మొదటిది వాటిలోని విషయం. ట్రంప్ తరచుగా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుం టారు, ఆగ్రహాన్ని, చిరాకును వ్యక్తం చేయడానికి భయపడరు. ట్రంప్, తన ఎన్ని కల ప్రచార కార్యక్రమంలో రష్యాతో సంబంధాలను నెరపారనే ఆరోపణపై ఆయన సొంత ప్రభుత్వ న్యాయశాఖే మే 18న ఆయనపై విచారణను ప్రారంభిం చింది. దీనిపై ‘‘ఇది అమెరికా చరిత్రలోనే ఒక రాజకీయవేత్తపై సాగిన అతి పెద్ద ఉద్దేశపూర్వక దాడి!’’ అని ట్వీట్ చేశారు. ‘‘క్లింటన్ ప్రచారంలోనూ, ఒబామా ప్రభుత్వంలోనూ అన్ని చట్టవిరుద్ధ చర్యలు జరిగినా స్పెషల్ కౌన్సిల్‌ను నియమిం చలేదు!’’ ట్రంప్ దురుసు మనిషి కూడా. తన ట్వీటర్ ఖాతాను వాడి పాత్రి కేయులు లేదా ఇతర వ్యక్తులపై దాడి చేయడానికి సైతం సంశయించరు. ‘‘ఈరోజు కుహనా మీడియా ఓవర్ టైం పనిచేస్తోంది!’’ అని మే 12న ట్రంప్ ట్వీట్ చేశారు.
ఈ ప్రవర్తనను ఆయన నిజాయితీగా చూపొచ్చు. కానీ ఇలాంటి చిన్న పిల్లాడి ప్రవర్తన ట్రంప్‌కు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడం కష్టం. సరిగ్గా ఈ విషయంలోనే మోదీ ఆయనకంటే చాలా భిన్నమైనవారు. ఇద్దరూ మీడియాను ఒకే విధంగా చూస్తారని అన్నాను. కానీ రివాజుగా సాగే సంభాషణలో ఆయన చాలా ఎక్కువ నిగ్రహాన్ని చూపుతారు. ట్వీటర్ ద్వారా ఆయన వెలిబుచ్చేవన్నీ సాధారణంగా ఆ రోజు తాను ఏం చేశారనే దానికి సంబంధించినవే. ఉదాహర ణకు, ‘‘ఈరోజు నాగాలాండ్ ట్రైబ్స్ కౌన్సిల్ ప్రతినిధి బృందాన్ని కలుసుకు న్నాను’’ అని మే 19న ట్వీట్ చేశారు. లేదా వ్యక్తులకు, ప్రత్యేకించి ఇతర రాజ కీయవేత్తలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. ‘‘మాజీ ప్రధాని, రైతు నేత శ్రీ హెచ్‌డీ దేవెగౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, సుదీర్ఘ ఆయుర్దాయాన్ని ఇచ్చుగాక’’ అని మే 17న ట్వీట్ చేశారు. ఇక మే 19న ‘‘ప్రియమైన అధ్యక్షులు@ashrafghani, మీకు అద్భుతమైన జన్మ దినాన్ని ఆకాంక్షిస్తున్నాను, భగవంతుడు మీకు దీర్ఘ ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక’’ అని ట్వీట్ చేశారు. మోదీ ట్వీటర్ ద్వారా విధానపరమైన ప్రకట నలను కూడా చేస్తారు. అయితే అవి సాధారణంగా వార్తాపత్రికల్లోగాక తన సొంత వెబ్‌సైట్లో ప్రచురితమైన నివేదికల గురించిన ట్వీట్లే. భారత ప్రధాని ఏమి ఆలో చిస్తున్నారో ఆయన ట్విటర్ సమాచారాన్ని బట్టి అంచనా వేయడం అసాధ్యం. అమెరికా అధ్యక్షుని విషయం అలా కాదు. ట్రంప్ చూస్తున్న చానల్స్ ఏవో తెలుసు కోవడం పాత్రికేయులకు సులువే. చూసిన వెంటనే ఆయన ఎలాగూ దానికి ప్రతి స్పందనగా ఏదో ఒకటి ట్వీట్ చేసేస్తారు.
అయితే ట్రంప్, మోదీలు ఇద్దరూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ, బయటి వారుగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకరు మూడేళ్ల కంటే కొద్దిగా ఎక్కువ కాలంగా పదవిలో ఉండగా, మరొకరు మూడు నెలలుగానే అధికారం నెరపు తున్నారు. అయితే, అప్పుడే ట్రంప్ పేరు వైఫల్యంతో ముడి పడిపోయింది. ఆయన మద్దతుదార్లు కొందరితో సహా చాలా మంది ఆయనను అసమర్థునిగా చూస్తున్నారు. మరోవంక మోదీ కూడా తప్పులు చేశారు, అతిగా వాగ్దానాలు చేశారు. అయితే ఆయనది జాగ్రత్తగా, సావధానంగా వ్యవహరించే వైఖరి. అదే ఆయనను విమర్శల నుంచి కాపాడుతోంది.
ట్రంప్ రోజువారీ పిల్లతనపు వెర్రి చేష్టలు, తనను ఎలా అనుచితంగా చూస్తు న్నారో చెబుతూ గుండెలు బాదుకోవడం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతౖమైన పదవిలోని ఉన్న వ్యక్తిని ఇలా చూస్తుం డటం విభ్రాంతికరంగా మారుతోంది.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత :
ఆకార్ పటేల్ aakar.patel@icloud.com