కొత్త పుస్తకాలు | new books in market | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Mon, Jul 4 2016 12:56 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

new books in market

 ఆది- అంతం
 రచన: పి.చంద్రశేఖర అజాద్; పేజీలు: 240; వెల: 150; ప్రచురణ: భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; ప్రతులకు: రచయిత, 909, సఫైర్ బ్లాక్, మై హోమ్ జ్యూయల్, మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్-49; ఫోన్: 9246573575
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన నవల ఇది. ‘విభిన్న పాత్రల మానసిక ఆంతరంగిక కల్లోలాలు, సంఘర్షణలు... వీటి నడుమ జీవితం, మనుషుల ప్రయాణం తాలూకు ప్రశ్నల పరంపర. సమాధానాల కోసం అన్వేషణ. ఏది ఆది? ఏది అంతం? ఆది-అంతం మధ్య జరుగుతున్న జగన్నాటకం. ఇది ఆలోచనాపరుల సమూహ చర్చావేదికగా నిలిచే ఆధునిక తాత్విక నవల’.
 
 తెలుగు నాటక రంగం
 వ్యాసకర్త: ఆచార్య ఎస్.గంగప్ప; పేజీలు: 208; వెల: 150; ప్రతులకు: కిన్నెర పబ్లికేషన్స్, 2-2-647/153, ఫ్లాట్ నం.101, 102, మద్దాళి గోల్డెన్ నెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-13. ఫోన్: 040-27426666
 ఇందులో తెలుగు నాటకరంగానికి సంబంధించిన 19 వ్యాసాలున్నాయి. ‘నాటకకళా రంగానికి సంబంధించిన వివిధ విభాగాల గురించి అంటే ప్రాచీన సంస్కృత నాటకాలు మొదలుకొని నేటి నాటకరంగం పోకడలపై చర్చిస్తూ... కళారంగం వెలుగునీడల్ని ప్రదర్శించే బాధ్యతాయుతమైన అభిప్రాయాలు వెలిబుచ్చడం ప్రస్తుత నాటకరంగానికి ఎంతో ఉపయుక్తం’.
 
 గీతాంజలి
 అనువాదం: నాగరాజు రామస్వామి; పేజీలు: 140; వెల: 100; ప్రతులకు: అనువాదకుడు, తేజ 914, మై హోమ్ నవద్వీప, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్-82; ఫోన్: 040-23112625
 1914 నాటికే తెలుగులోకి అనువాదమైన రవీంద్రుడి గీతాంజలి మళ్లీ మళ్లీ తెలుగు కవుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఈ వరుసలో ఇప్పుడు నాగరాజు రామస్వామి చేరారు. ‘డెబ్బై ఏళ్ల వయస్సులో కవితా వ్యాసంగానికి దిగిన’ ఈయన స్వయంగా కవీ, జాన్ కీట్స్ కవిత్వాన్ని తెలుగులోకి తెచ్చిన సమర్థ అనువాదకుడూ. ‘ఇదివరకటి అనువాదాలకు కాస్త భిన్నమైన ఒరవడిలో ఈ అనువాదం ఒక ప్రవాహంలా నడిచింది’.
 
 మూడు కోరికలు
 మూలం: ఐజక్ బషేవిస్ సింగర్; అనువాదం; కె.బి.గోపాలం; పేజీలు: 112; వెల: 60; ప్రతులకు: మంచిపుస్తకం, 12-13-450, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్-17; ఫోన్: 9490746614
 ‘సింగర్ కథారచన శిల్పానికి మెచ్చి ఆయనకు నోబెల్ బహుమానం ఇచ్చారు. అంతటి రచయిత అందరికీ అర్థంకాని విషయాలేవో రాయాలని మనం అనుకుంటాం. కానీ, ఆయన మరోలా అనుకున్నాడు. ‘పిల్లలకు నచ్చే కథలు లేదా పిల్లల కథలు రాయగలుగుతానని అనుకోనే లేదు,’ అంటాడాయన. పిల్లల కథల్లో పిల్లలు మాత్రమే ఉండరు. జంతువులు ఉంటాయి. పెద్దవాళ్లూ ఉంటారు. మొత్తానికి ప్రపంచం ఉంటుంది’ అంటున్న కె.బి.గోపాలం ఆ సింగర్ సృజించిన ప్రపంచాన్ని తెలుగులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement