మీకో దండం, పుష్కరాలకు రాకండి | Pilgrims should not come to Godavari puskaras | Sakshi
Sakshi News home page

మీకో దండం, పుష్కరాలకు రాకండి

Published Mon, Jul 20 2015 8:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

మీకో దండం, పుష్కరాలకు రాకండి

మీకో దండం, పుష్కరాలకు రాకండి

ఇంత మంది జనం వరదలా రావడంలో కొంత పాపం మీడియా వారికి ఉన్నా సరే, గోదావరిలో మునగకుండానే, నిజాలు ప్రసారం చేసి టన్ను పుణ్యం మూటకట్టుకున్నారు. వాటి స్ఫూర్తితో పుష్కరాల యాత్రలు రద్దు చేసుకుందాం.
 
 కిలోమీటర్ల మేరకు గోదావరి దారులన్నీ లక్షల వాహనాల తో మూసుకుపోయాయని టీవీ చానళ్లు చెప్పి చెప్పలేనంత మేలు చేశాయి. రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడు స్తున్నాయట. రెండు రాష్ట్రాల్లో బస్సు స్టేషన్లన్నీ రాని బస్సుల కోసం ఎదురుచూస్తున్న భక్తు లతో అద్భుతంగా నిండిపోయాయి. దాదాపు రెండు నెలల నుంచి హోరె త్తించే ప్రచారాలు చేసి, రారండోయ్ రారండోయ్ అంటూ దేశ విదేశాల గోదావరి భక్తులను ఆహ్వానించిన టీవీ యజమానులు, సంపాదకులు, విలేకరులు, కెమెరామెన్లు గోదావరిలో మునగకుండానే బోలెడంత పుణ్యం సంపాదించుకున్నారు. ఏ విధంగా అంటే రోడ్లు, రైలు మార్గాలు, బస్సులు, రైళ్లు కిటకిట లాడుతున్నాయని ఉన్నదున్నట్టు నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అసలుసిసలు సమాచారం అంద డం వల్ల పుష్కరాలకు వెళ్లకూడదని చాలా మంది వివేక వంతమైన నిర్ణయం తీసుకోవడానికి మీడియా ఎంతో కమిట్‌మెంట్‌తో ఉపయోగపడింది.
 
 గోదావరీ తీర జిల్లాల్లో భయంకరంగా ఈ కోలి రోగం వ్యాపించిందనే మరొక నిజం చెప్పి మీడియా ఇంకొంచెం పుణ్యం కట్టుకున్నది. మరీ పుష్కరాలకు వెళ్లొద్దని ఆ శాస్త్ర పరిశోధకులు చెప్పడానికి మొహ మాటపడ్డారేమో. మునగండి కాని, గుటకవేయకండి, నోట్లోకి కళ్లల్లోకి, చెవుల్లోకి ఈ కోలి నిండిన నీళ్లు వెళ్లకుం డా చూసుకోండి(ఇది సాధ్యమా) అని ఉచితంగా సము చిత సలహా ఇచ్చారు, మనవాళ్లు అచ్చు వేశారు. లక్షల మంది వినకపోయినా వందలమందైనా ఆలోచించే అవ కాశాన్ని జనమాధ్యమాలు కల్పించడం ముదావహం.
 తెలుగు వారు పరమభక్తులనడంలో సందేహం లేదు. ఎంత భక్తులంటే పుణ్యం సంగతేమోగాని గోదా వరిలోనే తొక్కిసలాటలో 29 మంది పంచప్రాణాలు హరీమన్నా భక్తిలో ఒక్క మిల్లీ మీటర్ తేడా కూడా రావ డంలేదు. శబరిమలైలో తొక్కిసలాటలు వచ్చినా, వార ణాశిలో జనం మునిగినా, కుంభమేళాలో ప్రాణాలు పోయినా, ఏది ఏమైనా సరే ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్న సినీ డైలాగు లాగించి లారీలు బస్సులు కార్లు, రైలు బస్సుటాపులమీదైనా సరే కూర్చు ని ప్రయాణించడంలో తెలుగు భక్తుడిని మించినవాడు ప్రపంచంలోనే ఉండడు. 29 మంది చనిపోయిన తరు వాత భయపడి భక్తులు రాక జనం తగ్గుతారేమో నని అనుకున్న వాడు బుద్ధి తక్కువ వాడన్నట్టు.
 
 వాడికర్మ కాలి వాడు పోయాడు. మనం ముక్తులమవుదాం, పునీతులమవుదాం, ప్రాణాలు పోతే పోతాయి, అంత కుముందు మనకు మనమే పిండాలు పెట్టుకుందాం అన్నంత కమిట్‌మెంట్‌తో భక్తులు పోటెత్తుతున్నారు.  గోదావరి గల గల, కళ కళ, పుష్కర శోభ, వైభవం, కవి తలు, కవులు వారి ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారాలు, పారవశ్యంతో చూస్తున్న తల్లులు తండ్రులు, వారి భక్తి సెగలు ఆకాశాన్నంటి దేవతలు దుందుభులు మోగిస్తు న్నారు. తెలుగు వారి భక్తితరంగాల్లో మునిగితేలుతున్న వారిని చూసి మురిసిపోతూ జయజయధ్వానాలు చేస్తు న్న వారితో ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయింది. తొక్కిస లాటలకు ఆకాశంలో ఆస్కారం లేదు కనుక ఎవరూ చేయనవసరంలేదు.
 
 ఏడాది పొడుగునా పుష్కరాలే అయినా మొదటి పన్నెండురోజులే ప్రధానం, అందులో మొదటి రోజు మరీ ప్రధానం. అందులో మొదటి గంట ఇంకా ఇంకా ప్రధానం, మునిగితే నేరుగా మోక్షమే... (అవును 29 మందికి దొరికినా నమ్మరా) అందులో మునుగుతున్న మన నేతలే మనకు ఆదర్శం, మనను ముక్తిమార్గంలో నడుపుతున్న అవధూతల మాటలే మనకు శిరోధార్యం అని జనం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. వచ్చారు. ఆగడంలేదు. పాపం చంద్రబాబైనా, చంద్రశేఖరుడైనా ఏం చేస్తారు? ఏదో సెంటిమెంట్‌తో రమ్మంటే ఇంతగా పోలోమని రావడమేనా? ఇంతగా వరదల్లో కొట్టుకొ చ్చిన తుంగల్లా వచ్చిన జనానికి ఎవరు మాత్రం ఏం ఏర్పాట్లు చేస్తారు? ఇదేమన్నా తిరుపతా? యాదాద్రా? ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు చదివి ఫస్టొస్తే ఏం లాభం, ఏఘాట్లో ఎప్పుడు స్నానం చేయాలో తెలియకపోతే? బంగారు అంచున్న పంచెల వారు ధగధగ మెరిసే కండువాల వారు శాస్త్రాలు చదివి ఓహో నెలల నుంచి చెబుతుంటే విని వచ్చే మనని ఆపడానికి ఈ ఖాకీ వారికి, వారిని నడిపే ఆ ఖాదీవారికి ఎంత ధైర్యం? పుష్కర మరణాలు ఎన్నయితేనేం పుష్కళంగా ఉన్న మన జనాభాకు వీసమెత్తు కూడా తేడా పడదు.
 
 మీడియాను అందరూ అన్ని రకాలుగా తిడుతు న్నారు. ఈ రోజు మీడియా నిజంగా చాలా మేలు చేసిం ది. అంతకు ముందు నెలల కొద్దీ ప్రచారం చేసినా సరే, ఇంత మంది వరదలా రావడంలో కొంత పాపం వారికి ఉన్నా సరే, వారు గోదావరిలో మునగకుండానే, నిజా లు ప్రసారం చేసి టన్ను పుణ్యం మూటకట్టుకున్నారు. పునీతులయ్యారు. వారి స్ఫూర్తితో వెంటనే పుష్కరాల యాత్రలు రద్దు చేసుకుందాం. మనం కూడా కలుషితం చేయనందుకు మనను గోదావరిలో ఉన్న పుష్కరుడు కరుణిస్తాడు. (దయచేసి గరికపాటి వారైనా ఈ నిజం చెబితే బాగుంటుంది). బస్సు టికెట్లు రద్దు చేసుకుం దాం, మన వల్ల ఒక్క బస్సు రద్దయినా గోదావరి దారి కాలుష్యం కొంత ఆపిన పుణ్యం మనకు దక్కుతుంది. పుష్కరాల రద్దు ద్వారా వచ్చిన పుణ్యాన్ని పాపం... పోయిన ఆ 29 ప్రాణులకు అర్పిద్దాం.
 
 వారి ఆత్మలు శాంతించడానికి. ఇక పుష్కరాల కోసం ప్రతిష్టను ఫణంగా పెట్టిన ప్రభువులకు కూడా కొన్ని మనవులు చేసుకుందాం. అయ్యా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారూ వెంట నే పుష్కరాల వాణిజ్య ప్రకటనలు మానేయండి (ఈ నష్టానికి మీడియా వారు క్షమించాలి మరి) బస్సులు (నడుస్తుంటే) ఆపకండి, తిరుగు ప్రయా ణాలు నడపం డి. వస్తే జూలై 26 తరువాతనే రండి అని మీరు విలేక రుల సమావేశాల్లోనైనా చెప్పండి. వీలైతే గోదావరిలో మునగడానికి తలకు రూ.100 పుష్కర పన్ను విధిం చండి. లేకపోతే శుద్ధమైన గోదావరి జలాలను బాటిళ్ల లో నింపి దేశమంతా పంచండి, నెత్తిన పోసుకోమ నండి, కాని పుష్కరాల స్నానాలకు నదుల్లా రావద్దని చెప్పండి. ప్లీజ్.
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
 - మాడభూషి శ్రీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement