
సీఎంలు ఇద్దరూ చిందులేయడం మానేయాలి
ఇప్పటికే విభజన తెచ్చిన సమస్యలను పరిష్కరించు కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సతమతమవుతుండగా.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మరింతగా ప్రజల మధ్య అపోహలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యేకించి వైఎస్సార్‌సీపీ పట్టిసీమ పథకాన్ని వ్యతిరేకించి పోలవరం ప్రాజెక్ట్‌ను అమలు పరుచుకోవడానికి తగిన నిధులు కేంద్రం నుండి రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. అదేవిధంగా పట్టిసీమ చేపట్టడం ద్వారా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో అనవ సర తగాదాలు రేకెత్తే అవకాశం ఉందని హెచ్చరిం చారు.
అయినా బాబు పట్టిసీమను మొండిగా కొన సాగిస్తున్నారు. పర్యవసానంగా తెలంగాణ రాష్ట్రం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. పాల మూరు ప్రాజెక్టు వల్ల దిగువన రాయలసీమ, కోస్తా జిల్లాల సాగునీటి ప్రయోజనాలు దెబ్బతినే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, సాగునీటి మంత్రివర్యులు మాటల తుటాలను పేలు స్తూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా రు. ఇదెంత దూరం వెళ్లిందంటే.. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు ఎలా నిర్మిం చారని ప్రశ్నిస్తూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీరు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా అన్యా యం చేసిందని తెలంగాణ నాయకులు ఆరోపణ లను గుప్పిస్తున్నారు.
తాజా వివాదాల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై చంద్రబాబు, దేవినేని ఉమా మరి యు ఆ పార్టీ మంత్రులు కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిస్తున్నారని విషప్రచారం మొదలుపెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ, తెలంగాణ ప్రాజెక్టులలో దేనినీ నిర్లక్ష్యంగా చూడ లేదు. చేవెళ్ల ప్రాణహిత, పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రం లో పాదయాత్ర చేశారు. అలాగే రాష్ట్రం విడిపోతే ఎగువన తెలంగాణలో చేపడుతున్న నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ తదితర ప్రాజె క్టులతో పాటు దిగువన కోస్తా జిల్లాలో రైతాంగం ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని పదే పదే హెచ్చరిక చేశారు. సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల సేద్యపు నీటి ప్రాజెక్టుల సాధన సాధ్యమని ఆయన చేసిన ఆవేదన, ఆక్రందన నేడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి.
రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో రాజ కీయ ప్రయోజనాలు దృష్ట్టిలో పెట్టుకుని జగన్ టీఆర్ ఎస్‌కు బహిరంగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. దానిని వక్రీకరించి జగన్‌పై రాజకీయ దాడిని నేడు తెలుగుదేశం పదేపదే చేస్తున్నది. చంద్ర బాబుగారు బీజేపీతో కలవచ్చు. 2009లో టీఆర్ ఎస్‌తో రాజకీయపొత్తు పెట్టుకుని ఎన్నికల్లో వైఎస్‌కు వ్యతిరేకంగా పోరాడవచ్చు. అలాగే వైఎస్సార్‌సీపీని రాజకీయంగా నిలువరించడానికి 5 ఏళ్లపాటు కాంగ్రె స్‌పార్టీతో చీకటి ఒప్పందం చేసుకుని జగన్‌మోహన్ రెడ్డిపై కేసులు పెట్టించి జైల్లో నిర్బంధించవచ్చు. చంద్రబాబు గారు ఏమైనా చేయొచ్చు.. కానీ.. వైఎస్సార్‌సీపీ మాత్రం ఆయనను బలపర్చాలి. చివ రికి ఆయన ఓటుకు నోటు కేసులో నిందితుడైన ప్పటికీ ప్రశ్నించకూడదు.
ఆయనపై తీవ్రమైన అవి నీతి ఆరోపణలు కొనసాగుతుండగా.. కేంద్రంలో మంత్రులు, ప్రధానితో కలవవచ్చు. అదే జగన్‌మో హన్‌రెడ్డి ఢిల్లీకి పోతే.. తన కేసులు మాఫీ చేయిం చుకోవడానికి వెళ్లారు అనే ప్రచారం ఎత్తుకుంటారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర జుగు ప్సాకరంగా తయారైంది. జగన్‌మోహన్‌రెడ్డి అవి నీతిని పదేపదే ప్రచారం చేస్తూ ప్రసారాలు చేస్తూవ స్తున్న ఈ ప్రచార మాధ్యమాలు ఓటుకు. నోటు కేసు లో బాధ్యతగా వ్యవహరించకపోవడం సిగ్గుమాలిన చర్య. రాజకీయ పార్టీలు విశ్వసనీయతను నిరూపిం చుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ముఖ్యంగా బీజేపీ ఈ ప్రత్యేకమైన సంధి దశలో తన సచ్ఛీలతను రుజువు చేసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది.
(వ్యాసకర్త కదలిక సంపాదకులు)
మొబైల్: 99899 04389
- ఇమామ్