
నివురుగప్పిన నిరుద్యోగం
వేలమంది నిరుద్యోగులను ఒక్కచోట చూస్తే భయం గొలుపుతుంది.
వేలమంది నిరుద్యోగులను ఒక్కచోట చూస్తే భయం గొలుపుతుంది. ఉద్యో గాల కోసం వారు పడుతున్న ఆరాటం చూస్తే ఆందోళన కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకొని, కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్న యువతీయువకులు లక్షలలో ఉంటే ఉద్యోగాలు వేలల్లో ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సరీస కమిషన్ (టీపీఎస్సి) ఉద్యోగాల ప్రదాన ప్రక్రియ ప్రారంభిం చింది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఈ సారి టీపీఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలలో తెలంగాణ ఉద్యమ చరిత్రపైన ప్రశ్నలు ఉంటా యని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ కోచింగ్ సెంటర్లలో బోధించని అంశం ఇది. నోటఖ్స చదివి బట్టీయం పెట్టి పరీక్షలు రాయడం మనం యువతీ యువకులకు నేర్పించాం. జరుగుతున్న చరిత్రను కూడా గైడ్ రూపంలోనో, నోట్స్ రూపంలోనో చదివితే కానీ వారికి అర్థం కాదు.
పోటీ పరీక్షలకు హాజరు కాబోయే నిరుద్యోగులకు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, భౌగోళిక శాస్త్రంపైన అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ దిన పత్రిక శనివారం ఉదయం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో, సిటీ సెంట్రల్ లైబ్రరీలో సదస్సు నిర్వహించింది. రెండు చోట్లా సమావేశమైన వేలాది నిరుద్యోగ యువతీయువకులలో అసహనం స్పష్టంగా కనిపించింది. వయోపరి మితి పెంచడంతో ఉద్యోగార్థుల సంఖ్య పెరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన వక్తలు మాట్లాడుతుంటే యువతీయువకులు ఏకాగ్రదీక్షతో వింటూ, నోటఖ్స రాసుకుంటూ ప్రతి అక్షరాన్నీ ఆస్వాదిస్తూ కనిపించారు. త్యాగరాయగాన సభలో ఆరువందల మందికే కుర్చీలు దక్కాయి. తక్కినవారంతా కిందే కూర్చు న్నారు. సిటీ లైబ్రరీలో అయితే కటిక నేలమీద వేలమంది కూర్చొని చెవులు రిక్కించుకొని మేధావుల ఉపన్యాసాలు ఆలకించారు. అయిదు వేల ఉద్యో గాలకు అయిదు లక్షల మంది పట్టభద్రులు పోటీ పడితే నూటికి ఒక్కరినే ఉద్యో గం వరిస్తుంది. నూటికి తొంభైతొమ్మిది మంది నిరాశకు గురి అవుతారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సకల సమస్యలూ తీరిపోతాయనే వెర్రి నమ్మ కం పెట్టుకున్నవారు ఆ నమ్మకం వమ్ము అయినప్చడు ఎట్లా స్పందిస్తారు? ఎట్లా సహిస్తారు? ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో మూడు అంశాలు ప్రధానమైనవి- నిధులు, నీళ్ళు, నియామకాలు. విద్యార్థులూ, యువతీయువ కులూ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్ఠ్గనడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగే నియామకాలన్నీ తమకే అందుతాయనే నమ్మకం. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వంలో తెలంగాణ రా? తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికి తెలంగాణ రాష్ట్ర సరీస కమిషనఖ అవత రించింది. అనంతరం కొన్ని మాసాలకు ఉద్యోగాలలో నియామకాల ప్రయత్నం జరుగుతోంది. టీపీఎస్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ముప్పయ్ మంది మేధావులతో సమాలోచనలు జరిపి సిలబస్, పరీక్షా విధానం, సెలక్షన్ ప్రక్రియ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, జియాగ్రఫీ, హిస్టరీ సబ్జెక్టులు ఉండాలనీ, వాటికి 250 మార్కులు కేటాయించాలనీ తీర్మానించారు. ఈ సబ్జెక్టుపైన అనేక సంశయాలు, పరీక్షా విధానంపైన వందలాది ప్రశ్నలు నిరుద్యోగులను వేధిస్తున్నాయి. ఘంటా చక్రపాణి దాదాపు వంద ప్రశ్నలకు సదస్సులో సమాధానాలు చెప్పారు. ఇంకా అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. తెలంగాణ ఉద్యమకారుడు వి. ప్రకాశ్ తెలంగాణ చరిత్ర చెబుతుంటే యువతీయువకులూ అమితాసక్తితో విన్నారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కోదండరామ్ల ఉపన్యాసాలు జాగ్రత్తగా విన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి కంటే ఆ సబ్జెక్టు తెలుసుకొని పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సంపాదించాలనే తాప త్రయమే ఎక్కువ.
అన్ని ఉద్యోగాలకూ అందరూ పోటీ
గ్రూప్-1 నుంచి విఏవో ఉద్యోగం వరకూ నిరుద్యోగులందరూ పోటీ పడుతు న్నారు. ఇంజనీరింగ్ చదివినవారు ఇంజనీర్లుగా పనిచేయాలనీ, ఫార్మసీ చదువు కున్నవారు ఫార్మసిస్టులుగా పని చేయాలనీ కోరుకుంటే ఇంత పోటీ ఉండదు. ఇంజనీరింగ్, వెటర్నరీ విద్య చదివినవారు కూడా విఏవో ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. అస్తవ్యస్తమైన మన విద్యావిధానానికి నిదర్శనం ఇది. జూని యర్ కాలేజీలు లేని చోట్ల సైతం ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పి వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులను తయారు చేసిన ఫలితం. నేషనలఖ శాంపిలఖ సర్వే ఆఫీసు నిర్వహించిన సర్వే ప్రకారం చదువురానివారిలో కంటే చదువు కున్నవారిలోనే నిరుద్యోగం ఎక్కువ. చదువులేనివారు ఏ పని చేయడానికైనా సిద్ధం. చదువుకున్నవారు వీలైతే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేటు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. లే దా నిరుద్యోగిగానే మిగిలిపోతారు. ఏదో ఒక పని చేసి కడుపు నింపుకోవాలని అనుకోరు.
వ్యవసాయదారుల కుటుంబాలలోనూ చదువుకున్నవారికి కూడా పొలం పని చేయడం నామోషీ. తల్లిదండులు పని చేస్తుంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ కూర్చుంటారు. మన దేశ జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసువారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో (1999-2004) దేశ వ్యాపితంగా 5.4 కోట్ల ఉద్యోగాలు సృష్టించారు. యూపీఏ పాలనలోని మొదటి ఏడు సంవత్సరాలలో (2004-11) అదనంగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 1.5 కోట్లు మాత్రమే. దేశంలో ప్రతి నెలా పది లక్షల మంది నిరుద్యోగుల జాబితాలో చేరుతున్నారు. వీరిలో సగం మంది ఉత్తరప్రదేశఖ, బిహార్, రాజస్థానఖ, మధ్యప్రదేశఖకు చెందినవారే. దక్షిణాది రా?ాలలో పరిస్థితి కొంత నయం. తెలుగు రా?ాలలో ప్రైవేటు పరిశ్రమలు విస్తరించలేదు. ?ఫ్టవేర్ రంగంలోనే ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ సంస్థల విస్తరణ కూడా ఒక దశకు వచ్చి నిలిచి పోయింది. జనాభాలో సగం మంది వ్యవసాయరంగంపైన ఆధారపడి జీవి స్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక 1998 నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదం టూ సుప్రీంకోర్టు మొన్న ఆదేశాలు జారీ చేసింది. రైతు సంక్షేమ కార్యక్రమాలను పునస్సమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పురమాయించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదు?
సుప్రీం ఆదేశం నిష్ఫలం
వ్యవసాయాన్ని ఎట్లా గిట్టుబాటు వ్యాసంగంగా మార్చాలో, పట్టణ ప్రాంతా లలో ఉద్యోగాలను ఎట్లా సృష్టించాలో ప్రభుత్వాలకు స్పష్టంగా తెలియదు. సబ్సిడీలు తగ్గించి ఆర్థిక సంస్కరణలను ముమ్మరం చేసి ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయాలన్న ధ్యాసే కానీ వ్యవసాయరంగం గురించి ఆలోచించినవారు లేరు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంపైకి వదిలిన నినాదా లలో ‘మేక్ ఇనఖ ఇండియా’ ఒకటి. విదేశాలు పెట్టుబడులు పెట్టి ఇండియాలో పరిశ్రమలు నెలకొల్పాలనీ, ఉత్పాదక రంగాన్ని విస్తరించాలనీ ఎనఖడీఏ సర్కార్ ఆకాంక్ష. పెట్టుబడులు పెట్టడానికీ, పరిశ్రమలు నెల కొల్పడానికీ అనువైన వాతా వరణం కల్పించే బాధ్యత రా? ప్రభుత్వాలది. ఎకనామిక్ జోనఖ్స ఏర్పాటు చేసి భూమి, నీరు, విద్యుత్తు తక్కువ రేటుకు అందజేసినట్లయితే విదేశీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసం. పరిశ్రమలకూ, ప్రాథమిక సదుపాయాల కల్పనకూ భూమి అవసరం. రైతుల నుంచి భూమి సేకరించాలంటే 2013 నాటి భూసే కరణ చట్టం అడ్డువస్తోంది. ఆ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించి ఎనఖడీఏ ప్రభుత్వం విఫలమైంది. ఆర్థిక ప్రగతి సైతం ఆశించినంత వేగాన్ని పుంజు కోవడం లేదు. పరిశ్రమలూ, వ్యాపారాలూ విస్తరించడం లేదు. ఉద్యోగాల సృష్టి జరగడం లేదు.
జాతీయ స్థాయిలో నిరుద్యోగులకు ఆశావహమైన పరిస్థితులు కనిపిం చడం లేదు. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు మరీ గందరగోళం. తెలంగాణలో ప్రభుత్వ రంగంలోనే విద్యుతఖ కేంద్రాలను నెలకొల్పాలనీ, ఆసుపత్రులను పున రుద్ధరించాలనీ ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అంతా ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతోంది. గోదావరి పుష్కరాలలో సమాచార శాఖ చేయ వలసిన పనులు ప్రైవేటు సంస్థ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రైవేటు మోజు బాగా ముదిరింది. సింగపూర్, జపాన్ తప్ప మరే మాటా మాట్లాడే పరిస్థితి లేదు. రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిం చడం, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం అనే రెండే రెండు కార్యక్రమాలపైన ఆంధ్ర ప్రదేశఖ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సింగపూరు ప్రభుత్వం, కంపెనీలు అమరావతి నిర్మాణంలో కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. పట్టిసీమ ప్రాజెక్టు ఉద్యోగాలు కల్పించదు. చంద్రబాబునాయుడు విదేశీ యాత్రలు సత్ఫలితాలు ఇచ్చి కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు విస్తరించే వరకూ నిరుద్యోగలు వేచి ఉండవలసిందే.
రగులుతున్న యువత
ఆంధ్రప్రదేశఖలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యా ప్రయత్నాలు జరగడం యువతలో పెరుగుతున్న అశాంతికి చిహ్నం. తెలంగాణలో ఇప్పటికే అగ్గి రగు లుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉడికిపోతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపైన ఆగ్రహించిన విద్యార్థులూ, నిరుద్యోగులూ నిరసన ప్రద ర్శనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను కూడా తగులపెట్టారు. ప్రాణహిత ప్రాజెక్టు గురించీ, సరికొత్త సచివాలయ నిర్మాణం గురించీ, ఉస్మా నియా ఆసుపత్రి భవనాన్ని కూల్చి జంట టవర్ల నిర్మాణం గురించీ ఆలోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్న దాఖలా లేదు. పల్లెల్లో వృత్తులు దెబ్బతిన్నాయి. మూతబడిన పరిశ్రమలు అట్లాగే ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రాలేదు. ప్రకటనలే మినహా ప్రగతి క్షేత్రంలో కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎవరి లోకంలో వారు విహరిస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతని అర్థం చేసుకు న్నట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాద సంకేతాలు గుర్తించకపోతే చాలా నష్టం జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగులు సంఘటితమై వీధుల్లోకి వస్తే ఎంత బలమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసు కున్నా ప్రయోజనం ఉండదు. టీపీఎస్సీ ద్వారా ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితమైనది. పరిశ్రమలూ, వాణిజ్యం విస్తరించడం ద్వారానే ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు పెంపొందించాలి. చెరువుల పునరుద్ధరణ కార్య క్రమం ప్రణాళికా బద్ధంగా అమలు జరిగినా పల్లెటూళ్లలో నీటి లభ్యత పెరిగి వ్యవసాయం పుంజుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తిరిగి వృత్తులకు జీవం వస్తుంది. పట్టణాలలో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికపైన బృహతఖ ప్రయత్నం జరగకపోతే యువజనం ఆగ్రహజ్వాలను పాలకవర్గం ఎదుర్కోవలసి వస్తుంది.
కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియర్ డైరెక్టర్