భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు.గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిలలో ఎవరూ గొప్ప కెప్టెన్లు అని పోల్చమనగా 'ఇద్దరు మంచి కెప్టెన్లే' అని స్టీవ్ వా అన్నాడు
కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉదయన్ సేవాసంస్థ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో స్టీవ్ వా మాట్లాడారు. కోల్ కతాకు 25 కిల్లో మీటర్ల దూరంలో ఉన్న బరాక్ పూర్ లోని ఉదయన్ నిర్వహణలో స్టీవ్ వా ప్రధాన నిర్వహకుడిగా సేవలందిస్తున్నారు. ఉదయన్ పిల్లలు స్టీవ్ వాను స్టీవ్ దా లేదా స్టీవ్ అంకుల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1998 లో కొల్ కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఉదయన్ కు ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అప్పటి నుంచి ఉదయన్ కు తన సోదరుడు మార్క్, కుటుంబంతో కలిసి ఉదయన్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు.