![Amit Shah is a Jain, says Raj Babbar - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/1/AMitha-shah_1.jpg.webp?itok=XEo4Jepk)
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తెర మీదకు వచ్చిన ‘హిందూ’ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రాహుల్ గాంధీ హిందువు కాదని బీజేపీ అంటే, ప్రధాని నరేంద్ర మోదీ హిందువుకాదని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనికి ఇరుపక్షాల నేతలు ఆజ్యం పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి అమిత్ షా కూడా హిందువు కాదని పేర్కొంది. అమిత్ షా జైనుడని కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు.
‘అమిత్ షా తాను హిందువునని చెప్పుకుంటారు. కానీ నిజానికి ఆయన జైన్ మతానికి చెందినవారు. రాహుల్ గాంధీ ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి శివారాధన చేస్తున్నారు. ఇందిరా గాంధీ రుద్రాక్షమాల ధరించేవారు. శివుడిని పూజించేవారు మాత్రమే రుద్రాక్షమాల ధరిస్తార’ని రాజ్‌బబ్బర్ అన్నారు.
సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో తాను హిందువును కాదంటూ రాహుల్ గాంధీ రిజిస్టర్‌లో పేర్కొన్నారంటూ బీజేపీ ఆరోపించడంతో వివాదం రేగింది. బీజేపీ ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. తాను శివభక్తుడినని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నిజమైన హిందువు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. మోదీ అనుసరించేది హిందుత్వమని, హిందూయిజానికీ.. హిందుత్వకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment