
సాక్షి, అమరావతి : బాబుగారి కోవర్ట్ ఆపరేషన్ మాట వింటేనే పోలీసులు వణికిపోతున్నారు. ఇందులో ఇరుక్కోకుండా చూడమంటూ కొంతమంది దేవుడికి ముడుపులు కూడా కట్టారట. ఇంత భయమెందుకని అడిగితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవాలను ఏకరవు పెడుతున్నారట. ఏ పాడు పని అప్పగించినా దానికి గ్రేడింగ్ ఇవ్వడం బాబుకు అలవాటే కదా! తెలంగాణ ఎన్నికలప్పుడు సర్వే పేరుతో ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. అక్కడి జనం ఈ వేషాన్ని గమనించి పట్టుకుని కట్టేసినంత పనిచేశారు.
పోలీసులం.. వదిలేయండని కాళ్లావేళ్లా పడాల్సి రావడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఈ తరహా వ్యూహామే రచించారట టీడీపీ నేతలు. ప్రత్యర్థి పార్టీల దగ్గరకెళ్లి గుట్టుగా గూఢచర్యం చేయించాలని పథక రచన చేశారట. దీనికోసం ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇచ్చి పంపుతారట. బాగా పనిచేసిన వాళ్లకు గ్రేడింగ్ ప్రకటించడమే కాదు.. అవార్డులు, రివార్డులు కూడా ఇస్తామని చెప్పారట. కానీ.. ఈ పాడు పనిచేసి పరువు పోగొట్టుకోడానికి, దొరికితే ఒళ్లు హూనం చేయించుకోడానికి తాము సిద్ధంగా లేమని కొంతమంది ఇంటెలిజెన్స్ సిబ్బంది మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment