coverts
-
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రహస్య స్నేహితులు! ‘కోవర్టు’ల కలకలం..!
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ రంగులు మారుతున్నాయి. ఉదయానికున్న సమీకరణాలు.. సాయంత్రానికి తలకిందులవుతున్నాయి. పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడం, ప్రచారాలు, కార్యక్రమాలపై నిఘా పెట్టడం.. ఉల్లంఘనలుంటే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితోపాటు ప్రత్యర్థి పార్టీలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వారు చేసిన తప్పులను వీరికి తెలియజేసే పనిని వారికి అప్పజెబుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడానికై నా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఫలానా పార్టీ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి ఇవి మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. కోవర్టుల కలకలం.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడి ఉన్నదే. కొంతమంది నాయకుడి వెన్నంటే ఉండి.. నమ్మకంగా నటించి ఇక్కడి విషయాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు. సంపాదనే పరమావధిగా ఈ పని చేస్తున్నారు. నాయకులు తనవెనుక ఉండే వారిలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసినా వారెవరో గుర్తించలేకపోతున్నారు. ప్రత్యర్థుల చెంత నమ్మకంగా పని చేస్తున్నవారిని నాయకులు బుట్టలోకి లాగుతున్నారు. వారి ద్వారా అక్కడ జరిగే విషయాలను తెలుసుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేతల వివరాలు, సభలు, సమావేశాల్లో జరిగే ఉల్లంఘనలు, ఎన్నికల్లో ధన, మధ్య ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ కోవర్టులు ఉపయోగపడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒక్కడుగు ముందేసిన కోవర్టులు.. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇచ్చిన డబ్బులు పంచుతూ మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని చెబుతున్నారన్న చర్చ ఉంది. ఇందుకోసం ప్రత్యర్థులు భారీగానే ముట్టచెబుతున్నారని సమాచారం. ఏం చేశారు.. ఎవరికి పంచారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల అధిష్టానం పంపిన పార్టీ ఫండ్‌పై పలు నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతోంది. ‘ఎవరికి ఇచ్చారు.. ఎక్కడ పంచారు?’ అంటూ బహిరంగంగానే నిలదీతల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు రూ.10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు అందినట్లు ఆపార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెండు విడతల్లో ఐదు రోజుల తేడాతో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందినట్లు ఆ పార్టీవర్గాల్లో జరుగతున్న చర్చ. అలాగే బీజేపీ అధిష్టానం అభ్యర్థులను బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు అందించినట్లు ఆ పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అర్బన్ స్థానాల్లో పోటీ చేస్తున్న కొందరికి అంతకుమించే అందించినట్లు ప్రచారం. అయితే పార్టీ కార్యకర్తలు, ఓటర్ల కోసం పంపిణీ చేయాల్సి ఉండగా.. చాలా చోట్ల వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదంటూ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల డబ్బుల వ్యవహారంలో అభ్యర్థుల కుటుంబాల్లో ముదిరిన ఆధిపత్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పడరాని పాట్లు పడుతుంటే... మరోవైపు కోవర్టులు, పార్టీఫండ్, డబ్బుల పంపిణీ వివాదాలతో తలలు పట్టుకుంటున్నారు. కోవర్టులకు భారీ నజరానాలు! రహస్య స్నేహితులు(కోవర్టులు) అందించిన స మాచారాన్ని బట్టి వారికి నజరానాలు అందించేందుకు అన్ని పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు సిద్ధమయ్యారు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి, ప్రచార సమయంలో అభ్యర్థి వెంట తప్పనిసరిగా వీడియో బృందం ఉంటోంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు అభ్యర్థులంతా రహస్య పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎన్నికల నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయాల్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రత్యర్థులకు చేరవేస్తే అందుకు తగ్గట్లుగా ప్రతిఫలం అందజేస్తున్నారు. కోవర్టుల స మాచారంతోనే ఎన్నికల సంఘాల వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు, జనగామ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల్లో ఈ తరహా ఫిర్యాదులందాయి. పలుచోట్ల డబ్బులు తరలి స్తున్న వాహనాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఇవి చదవండి: 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్‌కు ఈటల సవాల్ -
మళ్లీ 'ఓటుకు కోట్లు'..?
హైదరాబాద్‌లో తాజాగా ఓ పార్టీ జరిగింది. అదేంటీ ఎన్నో జరుగుతాయి.. ఇందులో విచిత్రమేముందంటారా?. అది చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యారనే సంబరంలో జరిగిన పార్టీ. ఆయన ద్వారా లబ్ధి పొందిన నిర్మాత ఒకరు.. ఓ వందమందిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఇచ్చిన పార్టీ. ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్న పార్టీ!. అన్నింటికి మించి ఈ పార్టీ ఓ ట్విస్ట్‌కు ముడిపడి ఉంది. అదేంటో చివర్లో చదివి తెలుసుకోండి.. చంద్రబాబు అరెస్ట్ పరిణామంపై టాలీవుడ్ పరిశ్రమ స్పందించలేదు. కానీ, ఆయన హయాంలో లబ్ధి పొందిన నలుగురు మాత్రం బహిరంగ మద్దతు ప్రకటించారు. టాలీవుడ్, ఇతరత్రులు స్పందించకపోవడంపై నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అవుతూ.. ‘డోంట్ కేర్’ అని తెగ ఫీలైపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. బాబు జైలు నుంచి రీలీజ్ అయ్యే కొన్నిరోజుల ముందు సంఘీభావం పేరిట ఒక మీటింగ్ పెట్టి మమా అనిపించేశారు కొందరు సినీపెద్దలు. తాజాగా జరిగిన చంద్రబాబు రిలీజ్ పార్టీలో ఆ నలుగురైదుగురు.. వాళ్లకు కావాల్సిన వాళ్లో.. లేదంటే సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కనిపిస్తే ఫర్వాలేదు. కానీ, సినీయేతర వ్యక్తులు ఈ పార్టీలో సందడి చేశారు. పైపెచ్చు రాజకీయ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వంపై వేర్వేరు కోణాల్లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారంతా ఒక్క చోట చేరారు. అదే ఇక్కడ పెద్ద విశేషమే కదా మరి. పార్టీ ఎందుకంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొని జైలు పాలయ్యారు చంద్రబాబు నాయుడు. ఆయన రాజమండ్రి జైల్లో 52 రోజులు గడిపారు. పైగా చేరిన నాటికంటే బయటకు వచ్చే నాటికి కిలో బరువు కూడా పెరిగారు. కానీ, బాబు జైల్లో ఉన్నంత కాలం కొందరు సహించలేదు. తిండి, నిద్రాహారాలు మాని చంద్రబాబు కోసం బెంగపెట్టుకున్నారు. చంద్రబాబుకి తమ సంఘీభావం ప్రకటిస్తూ ప్రకటనలు సైతం చేశారు. బాబు కోసం బెంగ పెట్టుకున్న ఆ పెద్దల కోసం జరిగిన పార్టీనే ఇది. అందరి ఎజెండా ఒక్కటే! వీళ్లంతా వేర్వేరు రంగాలకు చెందిన వాళ్లు. విచిత్రంగా ఒక్కటై.. చంద్రబాబుకు అనుకూలంగా వాయిస్ వినిపించేవాళ్లు. సినిమాల ద్వారా కొందరు, మీడియా ద్వారా మరికొందరు, రాజకీయాల్లో ఇంకొందరు, సామాజిక సేవ ముసుగులో కొందరు, ఉద్యమాల రూపంలో మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ల ఎజెండా ఒకటే. ‘‘చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. మళ్లీ తమ సామాజిక వర్గానికి, తమ మనుష్యులకు దోచిపెట్టాలి’’. ఇది ఎక్స్పెక్ట్ చేయనిదే! ఈ పార్టీ ఏపీ రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది. ఈ పార్టీలో తెలంగాణ ఎన్నికల చర్చ కూడా నడిచింది. కాంగ్రెస్‌ను గెలిపించాలని టీడీపీ తరపున ప్రతినబూనారు వీళ్లంతా. అందుకే పార్టీ ముగిసిన తర్వాత బాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు చంద్రబాబు అనుచరులు.. రేవంత్ రెడ్డి ముందు చాలా పెద్ద ఆఫర్ పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో మీకెంత డబ్బు కావాలి? ఎంత నగదు రూపంలో కావాలి? ఎక్కడెక్కడ డెలివరీ కావాలి? ఇలాంటి విషయాలు చర్చించినట్టు తెలిసింది. ఎంత డబ్బిస్తే .. మీరు గెలుస్తారు? ఇంకా ఎన్ని రకాలుగా మీకు సహకారం కావాలి అని ఓపెన్‌గా చంద్రబాబు తరపున రేవంత్‌కు వీళ్లు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లోనూ.. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంశం కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్ కి కూడా ఫండింగ్ చేయాలని ఈ వర్గాన్ని రాహుల్ తరపున రేవంత్ అడిగినట్టు తెలిసింది. ఆ సహకారం అందిస్తే.. టీడీపీకి మద్ధతుగా రాహుల్‌ను ఏపీలో మరిన్ని సభల్లో పాల్గొనేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 100 మీటింగ్స్ పెట్టాలి, అందులో 20 మీటింగ్స్‌కి రాహుల్ గాంధీ.. కనీసం 5 మీటింగ్స్ కి సోనియా రావాలి అని అడిగినట్టు సమాచారం. -
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో గుబులు రేపుతున్న మిలాఖత్ వ్యవహారాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు సర్వసాధారణం. ఆయా పార్టీల్లో ప్రత్యర్థి పార్టీల కోవర్టులు సైతం తమ కార్యకలాపాలు నడిపించడం గతంలో అక్కడక్కడా ఉండేది. కాగా ఉమ్మడి జిల్లాలో పస్తుతం ఈ కోవర్టుల సంస్కృతి ఒక వృత్తి మాదిరిగా తయారైనట్లు ఆయా పార్టీల శ్రేణులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు కాంగ్రెస్ నాయకులను కోవర్టులుగా మార్చుకుని పకడ్బందీగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. వీటి గురించి కార్యకర్తలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ● నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రథమ శ్రేణి నుంచి తృతీయ శ్రేణి నాయకులను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ మనుషులుగా మార్చుకున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ● నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పలువురు ప్రథమ శ్రేణి కాంగ్రెస్నాయకులు అధికారపార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధితో కలిసి తమ వ్యవహారాలను దర్జాగా చక్కబెట్టుకుంటున్న విషయం బహిరంగ రహస్యమైంది. కొందరు కాంగ్రెస్ నాయకులైతే ఏకంగా సదరు కీలక ప్రజాప్రతినిధి వద్ద ప్రతినెలా డబ్బులు తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపి స్తున్నాయి. ఇక ప్రభుత్వ, అసైన్డ్ భూములు, చెరువులు, కెనాల్స్ ఆక్రమించి అక్రమంగా వేస్తున్న వెంచర్లలో సైతం బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులతో క లిసి వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా వివిధ వ్యాపారాలు, మడిగెలు పొందడం, వైన్స్‌ల్లో భాగస్వామ్యం తదితర వ్యవహారాలను దర్జాగా చేసుకుంటున్నారు. గుట్టలు కూడా కలసికట్టుగా స్వాహా చేసి మొరం అమ్ముకున్నట్లు కిందిస్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. చివరకు అర్బన్ నియోజకవర్గంలో హాథ్‌సే హాథ్ జోడో యాత్రకు సైతం బీఆర్ఎస్ నుంచి స్పాన్సర్ పొందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెట్టుబడి పెట్టడమేమిటంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలపై విమర్శలు చేయవద్దంటూ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులకు సూచిస్తుండడం గమనార్హం. ● నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొందరు ప్రథమ శ్రేణి నాయకులు అధికార పార్టీతో సఖ్యతగా ఉంటూ కాంగ్రెస్‌కు గండికొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అంతగా ప్రాధాన్యత లేని కాంగ్రెస్ నాయకుడిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుండడం విశేషం. ● జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో సైతం ప్రథమ శ్రేణి కాంగ్రెస్ నాయకులకు ఒక జాతీయ స్థాయి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలంటూ పీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కోవర్టులున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నికల బరిలో ఏవిధంగా ఎదుర్కోవాలంటూ పీసీసీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక విజయోత్సాహం నీరుగారిపోతోందని కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. -
తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ‘కోవర్టుల’అంశం కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయపార్టీల కార్యకలాపాలు ఊపందుకోగా, కోవర్టుల అంశాన్ని బీజేపీ మరోసారి చర్చకు తెరలేపింది. బీజేపీలో ఉన్న సీఎం కేసీఆర్ కోవర్టులే తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నానని ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ తాజాగా చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కోవర్టులెవరో జాతీయ, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీలో కోవర్టులు ఎవరై ఉంటారా? అని రకరకాల ఊహాగానాలు పార్టీ నాయకుల్లో సాగుతున్నాయి. ఇప్పటికే కోవర్టులపై ఈటల వ్యాఖ్యలు.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితమే సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. బహిరంగంగా మాత్రం తమ పార్టీలో ఎవరూ లేరని గంభీరంగా చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఫలానా నేత అయ్యి ఉండొచ్చా.. సదరు నాయకుడి ప్రకటనలు, ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తోంది’అనే దాకా చర్చలు వెళ్లాయి. ఇప్పుడు నందీశ్వర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చకు కారణమయ్యాయి. గత కొన్నిరోజుల్లో ముఖ్యనేతలు నాలుగైదు సందర్భాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలు పేర్లు ప్రస్తావించకుండా పత్రికల్లో ప్రచురితమవ్వడం, టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? మళ్లీ ఇప్పుడెందుకు ? నందీశ్వర్‌గౌడ్ వ్యాఖ్యలతో మళ్లీ కోవర్టుల పంచాయితీ ముందుకొచ్చింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో అధినాయకత్వం మేధోమథనం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఇవి ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి చాన్స్ తీసుకోకూడదని.. సంస్థాగతంగా అధ్యక్షుడి మార్పు, ఎన్నికల కమిటీ నియామకం వంటి మార్పుచేర్పులపై నాయకత్వం దృష్టి పెట్టిన సందర్భంలో ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి? ఇవి ఎవరిని ఉద్ధేశించి చేసినవి? అనే చర్చ సాగుతోంది. ఈ కోవర్టుల గోలపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
బాబు బ్రోకర్లకు టైం వచ్చింది..! బీజేపీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి?
నమ్మక ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అనే విషయం ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన వెన్నుపోటు రాజకీయాలు ప్రదర్శించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీజేపీలోకి చంద్రబాబు పంపించిన పచ్చ నాయకులు యాక్టివ్ మోడ్‌లోకి రాబోతున్నారు. సోము వీర్రాజును బూచిగా చూపించి ఏపీ బీజేపీని ఖాళీ చేయించే పని ప్రారంభించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ కాషాయ పార్టీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? అన్నం పెట్టిన వారికే సున్నం తెలుగుదేశం పార్టీలో కరుడుకట్టిన నాయకులు కొందరు గత ఎన్నికల తర్వాత చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో ప్రవేశించారు. తమ స్వార్థం కోసం చేసిన తప్పులు, అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి పచ్చపార్టీ నుంచి కాషాయపార్టీలోకి ప్రయాణం చేశారు. వీరందరిని చంద్రబాబే తన కోవర్టులుగా పంపించారు. చంద్రబాబు కోటరీలోని సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వంటి అప్పటి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ప్రజాప్రతినిధులు కాని మరికొందరు నాయకులు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా బీజేపీలోని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఒక పెద్దమనిషి సహకారంతోనే కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఏపీలో బీజేపీ ఎదగకూడదనే లక్ష్యంతోనే కొందరు చంద్రబాబు కోవర్టులు ఆ పార్టీలో పనిచేస్తున్నారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కూడా అటువంటి నేతలు బీజేపీని నిర్వీర్యం చేసే కార్యక్రమం ప్రారంభించినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్రంలో బలంగా ఎదిగితే టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకుంటుందనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. అందుకే కమలం పార్టీని బలహీనపరిచే కుట్రలకు తెలుగు బిజెపి నేతలు పాల్పడుతున్నారు. బిజెపిని బలహీనపరిచే ప్రక్రియలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పావుగా వాడుకుంటున్నారు. సోము వీర్రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో కుమ్మకయ్యారంటూ ఎల్లో మీడియాతో కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిజెపి నేతలను ఒక్కొక్కరిగా టిడిపిలో జాయిన్ చేసేందుకు ఈ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువస్తున్నారు. ఇవే ఆరోపణలు బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో చేయించి కన్నాను తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయించారు. ఇప్పుడు కన్నా తరహాలోనే మరి కొంతమందిని టిడిపిలోకి పంపించేందుకు పచ్చ బిజెపి నేతలు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో ముందుగా మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తరువాత బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వంటి పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరో ఏడాదిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల నాటికి బీజేపీ, జనసేనతో కలిసి కూటమి కట్టాలని పచ్చ నేతలు ఎప్పటినుంచో నానాపాట్లు పడుతున్నారు. అలా జరగలేదంటే బీజేపీలోకి వెళ్ళిన పచ్చ పార్టీ నాయకులు, మరికొందరు బీజేపీ నాయకులు టీడీపీలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని కాషాయ పార్టీ నాయకులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. -
ఈటలకు విజయశాంతి కౌంటర్.. అలా మాట్లాడితే సరిపోదు కదా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో, తెలంగాణ బీజేపీ నేతలు ఈటల వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ అటాక్ చేశారు. కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టండి అంటూ కామెంట్స్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే కేంద్రం కూడా వారిపై చర్యలు తీసుకుంటుంది. వారి గురించి నిజాలు బయటపెట్టండి. దీంతో, పార్టీకి మీరు మేలు చేసిన వారు అవుతారు అని ఈటలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారిని పోలీసులను అప్పగించాలి కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా ఈటలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. మరోవైపు.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీలో కోవర్టులు ఉండరు. బీజేపీ సిద్దాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. -
అన్ని పార్టీల్లో కేసీఆర్‌కు కోవర్టులున్నారు.. ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. "అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈటల కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రానున్న కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు పొలిటికల్ పార్టీలను టెన్షన్‌కు గురిచేస్తున్నారు. కాగా, కేసీఆర్‌కు చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్స్ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి. -
... కోవర్టుల్లోనే కాంగ్రెస్ ఉందేమో..!
... కోవర్టుల్లోనే కాంగ్రెస్ ఉందేమో..! -
కాంగ్రెస్‌లో ‘కోవర్టుల’ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోవర్టుల అంశం కుదిపేస్తోంది. ఇది సీనియర్లను కలవరపరుస్తుండగా, పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే టీఆర్ఎస్, బీజేపీలకు కోవర్టులుగా కొందరు నేతలు పనిచేస్తున్నారని, అందుకే పనిగట్టుకుని అసమ్మతివాదం వినిపిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. సీనియర్ నాయకుల పేర్లు పెట్టి మరీ కోవర్టుల ముద్ర వేసే ప్రయత్నాలు గతంలో జరిగినా ఏఐసీసీ కానీ, పీసీసీ కానీ ఖండించకపోవడం గమనార్హం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆయనతో కూడా కోవర్టులకు వార్నింగ్‌లు ఇప్పించడం, ఆ తర్వాత అదే ప్రచారం పదేపదే జరుగుతుండటం, తాజాగా దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో కోవర్టుల అంశం కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నిసార్లు అడిగినా...! టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులనే పదం తరచుగా వినిపిస్తోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై ఎవరు నోరువిప్పినా వారు కోవర్టులని సోషల్ మీడియాలో ప్రచారం జరిగేది. కొన్ని సందర్భాల్లో టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ... ఇలా చాలామంది నేతలు ఇతర పార్టీలకు కోవర్టులుగా మారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారం జరిగినప్పుడల్లా పార్టీ పక్షాన ఖండించాలని సదరు నేతలు కోరినా అటు ఏఐసీసీగానీ, ఇటు టీపీసీసీగానీ పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో, వేదికల్లో ఇలా ప్రచారం చేస్తోంది రేవంత్రెడ్డేననే చర్చ కూడా జరిగింది. అయితే, రేవంత్‌రెడ్డి మాత్రం ఈ ప్రచారంతో తనకు సంబంధం లేదని కొట్టిపారేశారే తప్ప పార్టీలో కోవర్టులులేరని ఖండించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కనుగోలు కార్యాలయంలో కుట్ర జరిగిందా? తాజాగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి సందర్భంగా కోవర్టుల వ్యవహారానికి సంబంధించిన పలు విషయాలు, విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు కూడా వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టేలా ఈ కార్యాలయం పనిచేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం బహిరంగంగానే వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేసే విధంగా తలలు మార్చి మార్ఫింగ్ చేసిన ఫొటోలు సునీల్ కనుగోలు కార్యాలయంలో దొరికాయని తనకు పోలీస్ కమిషనరే చెప్పినట్టు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించడం తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం కలిగిస్తోంది. అయితే సొంత పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం సునీల్ కనుగోలుకు ఏముందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కార్యాలయంపై దాడి అనగానే రేవంత్ రెడ్డి వర్గ నేతలు హడావుడి చేశారని, ఈ నిజాలు బయటకు వస్తాయనే నానా హంగామా చేసి ఏ అంశంపై స్పందించని విధంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు ఇదే కారణమనే చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి కాంగ్రెస్ వాదులను వెళ్లగొట్టే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే మీడియా ముందుకు రావాలని సీనియర్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికితోడు కీలక నాయకులు సిఫారసు చేసిన జిల్లా అధ్యక్షులను ప్రకటించకుండా నిలిపివేయడం, పీసీసీ డెలిగేట్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకంలో పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేవారికే పదవులు ఇప్పించడంతో ఈ నేతల్లో అసమ్మతి పెల్లుబికింది. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ కాంగ్రెస్ తమ చేతి నుంచి వెళ్లిపోతుందనే ఆందోళనతోనే తాజా కార్యాచరణకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పూనుకున్నారని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌ను నాశనం చేస్తోంది వారేనా?.. గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది?
తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులున్నారా? వారి వల్లే పార్టీ నిర్వీర్యం అవుతోందా? కాంగ్రెస్‌ను నాశనం చేసే లక్ష్యంతోనే కొందరు నాయకులు గాంధీభవన్‌లో పనిచేస్తున్నారా? టీ.పీసీసీ కమిటీలు వేసినప్పటినుంచీ కాంగ్రెస్‌లో రచ్చ మామూలుగా జరగడంలేదు. అన్ని స్థాయిల్లోనూ కమిటీల పట్ల అసంతృప్తి రగులుకుంటోంది. సీనియర్లంతా కమిటీల తీరుపై మండిపడుతున్నారు. గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది? అసహనం, ఆగ్రహం, ఆవేదన తెలంగాణ కాంగ్రెస్ కమిటీలు ప్రకటించినప్పటినుంచి పరిస్థితి అదుపు తప్పింది. పీసీసీ, డీసీసీలకు కమిటీలతో పాటు..రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ హైకమాండ్ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చినప్పటినుంచీ టీ.కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ అవుతోంది. పదవులు రానివారు, వచ్చిన పదవి నచ్చనివారు, తమవారికి అడిగిన పదవులు రానివారు.. ఇలా నానా రకాల నాయకులంతా కమిటీల ఏర్పాటుపై అసహనం, ఆగ్రహం, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా సీనియర్లంతా కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఏర్పాటులో తమను అవమానించారని మండిపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించినవారు.. ఆయన్ను సమర్థించినవారు కూడా కమిటీల విషయంలో భగ్గుమంటున్నారు. మమ్మల్ని అవమానిస్తారా? కాంగ్రెస్‌లో పై నుంచి కింది వరకు పార్టీ ఎజెండా కంటే పర్సనల్ ఎజెండాకే ప్రాముఖ్యమిస్తారనే విమర్శ ఎంతో కాలం నుంచి ఉంది. అందుకూ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరుతున్నాయంటూ చాన్నాళ్ళ క్రితమే ఆందోళన మొదలైంది. ఒక వర్గ నాయకులు పథకం ప్రకారం టీ. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడం కోసం పనిచేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ గురించి తెలియనివారికి, కాంగ్రెస్ లక్షణాలు లేనివారికి, నిన్నా..మొన్నా వచ్చిన వారికి కీలక పదవులు అప్పగిస్తున్నారని..సీనియర్లకు కనీసం సమాచారం ఇవ్వకుండా కమిటీలు వేశారని మండిపడుతున్నారు. కొండా సురేఖ వంటి సీనియర్ నేతలు తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కొండా సురేఖ తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా సమర్పించారు. చదవండి: (TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!) ఇజ్జత్ పోయింది.. ఇంకేముంటాం? ఓరుగల్లులో కొండాతో మొదలైన అసంతృప్త జ్వాలలు..ఖమ్మం మీదుగా...నల్గొండ నుంచి మెదక్ జిల్లా ద్వారా గాంధీభవన్‌కు వ్యాపించాయి. జిల్లా కమిటీలు వేసేటపుడు సంబంధిత జిల్లాలోని సీనియర్లకు చెప్పే పనిలేదా అంటూ భట్టి విక్రమార్క నిలదీసారు. పార్టీలో పీసీసీకి ఉన్నంత విలువ సీఎల్పీకి కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీల్లో సీనియర్లకు ఘోర పరాభవం జరిగిందని మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏ స్థాయిలోనూ సీనియర్లను లెక్కలోకి తీసుకోలేదని హైకమాండ్‌ను, పీసీసీ చీఫ్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్‌లో కోవర్టిజం రాజ్యమేలుతోందని ఆరోపించారు. పార్టీలోని కొందరు అధికార పార్టీ కోసం పనిచేస్తూ..కాంగ్రెస్‌ను సర్వ నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టుల కోసం కొత్త కమిటీలా? రెండు రోజులుగా సీనియర్లంతా జట్లు, జట్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకు, తమవారికి జరిగిన అన్యాయం గురించి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కోవర్టులను కాపాడేందుకే కొత్త కమిటీలు వేశారని, వారికే ప్రాధాన్యమిచ్చారని విమర్శిస్తున్నారు. పార్టీలోని కోవర్టుల గురించి హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారని అందుకే రోజు రోజుకూ కాంగ్రెస్ పతనం అవుతోందనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అసంతృప్త నాయకులు. టీ.పీసీసీలో తలెత్తిన ఈ అసంతృప్త జ్వాలలు, ఆగ్రహ జ్వాలల్ని హైకమాండ్ ఎలా అదుపులోనికి తెస్తుందో చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలో కోవర్టులున్నారా..? వారి మూలంగానే పార్టీ నష్టపోతోందా? పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నారా...? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్‌లో ఇంటిదొంగలున్నారని, వారెవరో త్వరలోనే చెబుతామంటూ ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు సీనియర్లు ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించడంతో.. అసలు కోవర్టులెవరనే దానిపై చర్చ మొదలైంది. అయితే, కోవర్టులు ఎవరనే విషయంలో స్పష్టత రానప్పటికీ వారి మూలంగానే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని టీపీసీసీ నేతలు గుర్తించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా గోడ దూకిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు గతంలో మరో నలుగురు పార్టీ మారేందుకు వీరే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ ఉంటూనే...! గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీలో కోవర్టుల వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ కోవర్టులు టీపీసీసీకి చెందిన వారు కాదని, వేరే రాష్ట్రానికి చెందిన వారనే చర్చ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. టీపీసీసీలో కూడా ఒకరిద్దరు ఉన్నప్పటికీ వారు నేరుగా పార్టీకి నష్టం చేసేంత శక్తి కలిగిన నేతలు కారని, పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నాయకుడే తెలంగాణ కాంగ్రెస్‌కు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు టీపీసీసీలోని కొందరు సహకరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆయనతో పాటు మరికొందరు టీపీసీసీ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని కొందరు అంటున్నారు. ఏదైనా కీలక అంశానికి సంబంధించిన టీపీసీసీ నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే ఆ సమాచారం ప్రత్యర్థి శిబిరానికి వెళ్తోందని, పార్టీ నిర్ణయాలను గులాబీ గూటికి మోసే కొందరిని గుర్తించారని కూడా అంటున్నారు. ‘పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు కీలక నిర్ణయాలను ఇతర పార్టీలకు చేరవేసేలా కొందరు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీనిపై పార్టీ కూడా ఆరా తీస్తోంది. ఈ విషయంలో ఎవరైనా ఆధారాలతో దొరికితే మాత్రం పార్టీ పరంగా కచ్చితంగా చర్యలుంటాయి.’అని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. టికెట్లు ఇప్పించడంలోనూ... కాంగ్రెస్ కోవర్టులు పార్టీ నిర్ణయాలను మార్చగలిగే స్థాయికి చేరుకున్నారని, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీని కూడా ప్రభావితం చేసి చివరి నిమిషంలో టికె ట్లు మార్పించారనే చర్చ జరుగుతోంది. పారాచూట్లకు టికెట్లు లేవని ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు రావడంలో, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ పార్టీకి అండగా ఉన్నవారికి టికెట్లు రాకుండా చేయడంలో వీరు కీలకపాత్ర పోషించారనే వాదన వినిపిస్తోంది. పార్టీ లో ఎమ్మెల్యేల మార్పునకు సహకరించిన, పార్టీ నిర్ణయాలను ఇతరులకు చేరవేస్తున్న నేతలెవరు? వారి పేర్లు బయటపడతాయా? టీపీసీసీ గుర్తించి చర్యలు తీసుకుంటుందా? కోవర్టుల కథ కొనసాగుతూనే ఉంటుందా? ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. -
‘బాబో’య్! మాకొద్దీ ఆపరేషన్
సాక్షి, అమరావతి : బాబుగారి కోవర్ట్ ఆపరేషన్ మాట వింటేనే పోలీసులు వణికిపోతున్నారు. ఇందులో ఇరుక్కోకుండా చూడమంటూ కొంతమంది దేవుడికి ముడుపులు కూడా కట్టారట. ఇంత భయమెందుకని అడిగితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవాలను ఏకరవు పెడుతున్నారట. ఏ పాడు పని అప్పగించినా దానికి గ్రేడింగ్ ఇవ్వడం బాబుకు అలవాటే కదా! తెలంగాణ ఎన్నికలప్పుడు సర్వే పేరుతో ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. అక్కడి జనం ఈ వేషాన్ని గమనించి పట్టుకుని కట్టేసినంత పనిచేశారు. పోలీసులం.. వదిలేయండని కాళ్లావేళ్లా పడాల్సి రావడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఈ తరహా వ్యూహామే రచించారట టీడీపీ నేతలు. ప్రత్యర్థి పార్టీల దగ్గరకెళ్లి గుట్టుగా గూఢచర్యం చేయించాలని పథక రచన చేశారట. దీనికోసం ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇచ్చి పంపుతారట. బాగా పనిచేసిన వాళ్లకు గ్రేడింగ్ ప్రకటించడమే కాదు.. అవార్డులు, రివార్డులు కూడా ఇస్తామని చెప్పారట. కానీ.. ఈ పాడు పనిచేసి పరువు పోగొట్టుకోడానికి, దొరికితే ఒళ్లు హూనం చేయించుకోడానికి తాము సిద్ధంగా లేమని కొంతమంది ఇంటెలిజెన్స్ సిబ్బంది మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట. -
కోవర్టులతో కొంప కొల్లేరు..!
సాక్షి, జనగామ:ముందస్తు ఎన్నికల్లో కోవర్టుల వ్యవహారం నేతలకు తలనొప్పిగా మారింది. అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు గంటల వ్యవధిలోనే వేరే పార్టీలో చేరుతుండడంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు పెడుతోంది. ఇదిలా ఉంటే వెంట ఉన్నట్టే నటన చేస్తూ కోవర్టులుగా వ్యవహరిస్తూ.. ఇక్కడి, అక్కడి సమాచారాలను ప్రత్యర్థులకు చేరవేస్తూ.. అభ్యర్థులకు హార్ట్ఎటాక్ తెప్పించేంత పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థులకు కోవర్టుల బెడద తప్పడం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. స్థిరత్వం లేకుండా ప్రలోభాలకు లొంగి పార్టీలు ఫిరాయిస్తున్న వారితో పాటు ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతూ.. అక్కడి సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచర గణంతో చర్చించి ఏ గ్రామంలో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలని, ఎవరిని ప్రలోభాలకు గురిచేస్తే తమకు లాభం చేకూరుతుంది అనే అంశాలపై చర్చించుకుంటున్నట్లు వినికిడి. మద్యం, విందులు పంపిణీపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లోనే ఉన్న కోవర్టులు సమయం చూసుకుని, తమ ప్రత్యర్థి శిబిరాలకు సమాచారాన్ని అందిస్తున్నారు. దీంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న అభ్యర్థి కంటే ముందుగానే ప్రత్యర్థి నేతలు వెళ్లి, అక్కడి వ్యవహారాలను చక్కబెడుతూ.. వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని కోపతాపాల మీద ఉంటున్నారని రాజకీయ పార్టీల విశ్లేషణ. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఉన్న కొద్ది రోజులను సద్వినియోగం చేసుకుని, గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలనుకుంటున్న అభ్యర్థులు కోవర్టులపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. గోడదూకే ప్రయత్నం చేస్తున్న నాయకులు.. కార్యకర్తలను బుజ్జగించి పార్టీ ఫిరాయింపులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులసంఘాల ప్రతినిధులు ఇరువర్గాల వారిని కలిసి లాభపడాలనే ఆలోచనతో వస్తే.. ఇలాంటి వారిని కూడా గుర్తించడానికి కోవర్టులు ఉపయోగపడుతున్నారు. కోవర్టులు..ఫిరాయింపులతో అభ్యర్థులకు కంటి నిండా నిద్ర కూడా పట్టే పరిస్థితి లేకుండా పోయింది. -
కొంప ముంచుతున్న కోవర్టులు!
సాక్షి, ఆర్మూర్: సార్వత్రిక ఎన్నికల్లో కొత్త కొత్త సమస్యలు అభ్యర్థులుగా తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. అప్పటి దాకా వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్లేటు ఫిరాయిస్తుండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అదే సమయంలో తమ వెంట ఉన్న వారిలో కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తూ సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరాలకు చేర వేస్తుండడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు కోవర్టుల తలనొప్పి ఉంది. స్థిరత్వం లేకుండా అభ్యర్థుల ప్రలోభాలకు లొంగి పార్టీలు ఫిరాయిస్తున్న వారితో పాటు ప్రస్తుతం ఉన్న పార్టీలోనే కొనసాగుతూ అక్కడి సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరానికి ఎప్పటికప్పుడు చేర వేస్తూ కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచర గణంతో చర్చించి ఏ గ్రామంలో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరిని ప్రలోభాలకు గురి చేస్తే తమకు లాభం చేకూరుతుంది అనే అంశాలపైచర్చించుకుంటున్నారు. మద్యం, విందులు, డబ్బుల పంపిణీపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ చర్చల్లోనే ఉన్న కోవర్టులు సమయం చూసుకొని తమ ప్రత్యర్థి శిబిరాలకు సమాచారాన్ని చేర వేస్తున్నారు. దీంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న అభ్యర్థి కంటే ముందుగానే ప్రత్యర్థి శిబిరానికి చెందిన నాయకులు వెళ్లి అక్కడి వ్యవహారాలను చక్కబెడుతూ, వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఉన్న కొద్ది రోజులను సద్వినియోగం చేసుకొని గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలనుకుంటున్న అభ్యర్థులు కోవర్టులపై పెద్దగా దృష్టి సారించలేక పోతున్నారు. మరో వైపు అభ్యర్థి శిబిరంలో జరుగుతున్న తాజా వ్యవహారాలను కోవర్టులు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి శిబిరానికి చేర వేస్తున్నారు. ఎవరైనా వ్యక్తి అభ్యర్థిని కలవడానికి వారి పార్టీ శిబిరానికి వస్తే, ఆ సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి శిబిరానికి చేరిపోతోంది. వెంటనే సదరు నాయకులు ఆ వ్యక్తికి లేదా అతని కుటుంబ సభ్యులను సంప్రదించి వారిని బుజ్జగించి పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటున్నారు. కుల సంఘాల ప్రతినిధులు ఇరు వర్గాల వారిని కలిసి లాభపడాలనే ఆలోచనతో వస్తే.. ఇలాంటి వారిని కూడా గుర్తించడానికి కోవర్టులు ఉపయోగపడుతున్నారు. ఏదేమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికలు అభ్యర్థులు, ప్రత్యర్థుల ఎత్తులు, చిత్తులతో చిన్నసైజు యుద్ధాలనే తలపిస్తున్నాయి. -
కోవర్టులతో జర భద్రం ...!
ఏవైనా ఎన్నికలనగానే కాంగ్రెస్ నేతలకు ముందుగా ఒక భయం పట్టుకుంటున్నదట. సొంత పార్టీలోనే ఉంటూ వైరిపక్షాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయం చేస్తున్న విభీషణుల పట్ల ఎక్కువగా జాగ్రత్త పడాల్సి వస్తోందని వాపోతున్నారట. జీహేచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలి స్థానిక ఎమ్మెల్సీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి తగిన బలమున్నా కొన్నిసీట్లను ఓడిపోవడం, ఒకజిల్లాలో పార్టీ అభ్యర్థే ఏకంగా అధికారపార్టీకి మద్దతుగా విరమించుకుని అందులో చేరడం వంటివి ‘హస్తం’ పక్షంవారికి మింగుడుపడడం లేదట. మరీ రంగారెడ్డిజిల్లాలో ఎమ్మెల్సీ గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలమున్నా ఓడిపోవడం పట్ల అధిష్టాననేతలే ఒకింత ఆశ్చర్యపోయారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అధిష్టానదూత దీనిపై తన డిప్యూటీని పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలంటూ ఆర్డర్ ఇచ్చేశారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్థుల ఎంపికనుంచే ఆచితూచి వ్యవహరించాలని నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో పోటీచేసి నాలుగైదు స్థానాల్లో నిలవడమే కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన నేతల సిఫార్సులకు అనుగుణంగా టికెట్లు ఇవ్వొద్దనే తాఖీదును కూడా అధిష్టానం దూత రాష్ట్రనేతలకు ఇచ్చారట. దీనితో తమ వారికి టికెట్లు ఇప్పించుకోవాలని కలలుకన్న ఢిల్లీస్థాయి నేతలు, మాజీమంత్రుల గొంతుల్లో వెలక్కాయ పడ్డట్టయ్యిందట. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు నేర్పిన అనుభవంతోనైనా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కొంతమేరకైనా పరువునిలబడదనే అభిప్రాయానికి పార్టీ నాయకులు వచ్చారట. చివరకు గెలిచిన వారిని సైతం హైజాక్ కాకుండా కాపాడుకోవడంతోపాటు పార్టీలోని కోవర్టుల పట్ల సదా పారాహుషార్‌గా ఉండాలంటూ ఫిక్స్ అయ్యారట...!