
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఒక అవాస్తవాన్ని అదే పనిగా చెబుతుంటే దాన్నే నిజమని ప్రజలు విశ్వసిస్తారనే వ్యూహరంతో రాహుల్ ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ పాలనను విమర్శించేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి అంశాలు దొరకడం లేదని ఈ ఉదంతం వెల్లడిస్తోందని జైట్లీ ఎద్దేవా చేశారు.
రాఫెల్ డీల్‌లో అక్రమాలు జరిగాయనేది అబద్ధమని, 15 మంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు బకాయిపడిన రూ రెండున్నర లక్షల కోట్లను ప్రధాని మోదీ మాఫీ చేశారనేది మరో అసత్యమని చెప్పుకొచ్చారు. రాహుల్ చెప్పే ప్రతి మాట అవాస్తవాలతో కూడుకున్నదని అన్నారు. రాఫెల్ డీల్‌పై, ఎన్‌పీఏలపై అసత్యాలు చెబుతున్న రాహుల్ కన్నుగీటడం, కౌగిలింతల వంటి తన చౌకబారు చేష్టలతో ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment