సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని.. బీజేపీని చిత్తుగా ఓడించాలని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన జిల్లాలోని ఆర్మూర్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మూర్‌లో ఎంఐఎం పార్టీని ఐదు స్థానాల్లో గెలిపించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దళితులు, ఆదివాసులు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా.. ఎంఐఎం పార్టీకీ ఓటు వేయాలన్నారు. నిజామాబాద్‌లో తన చెల్లి ఓడిపోవటం చాలా బాధాకరం అన్నారు.
చదవండి: ‘ఎంఐఎం పోటీ చూస్తుందంటే అన్ని పార్టీలకు భయం’
మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని అసదుద్దీన్ హెచ్చరించారు. పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ బిల్లు పత్రాలను చింపేశానని ఆయన తెలిపారు. దేశంలో రోజుకు 36 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అసదుద్దీన్ ఆవేదన వ్యక్త చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం 25 మంది ముస్లిం యువకులను పొట్టనబెట్టుకుందని ఆయన మండిపడ్డారు. యూపీలో ఇప్పటి వరకు 21 మంది ముస్లిం యువకుల పోస్ట్‌మార్టం రిపోర్టు ఇవ్వలేదని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోహన్ భాగవత్ ‘ఇద్దరి సంతానం చట్టం’ తేవాలని కేంద్రానికి సూచిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం దేశంలో ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అసదుద్దీన్ ధ్వజమెత్తారు.
చదవండి: అసదుద్దీన్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment