
సాక్షి, కామారెడ్డి: మజ్లిస్ పార్టీ ఒక్క హైదరాబాద్‌కే పరిమితం అయిందని ప్రచారం చేస్తున్నారని.. అది తప్పని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటే అన్ని పార్టీలకు భయం పట్టుకుందన్నారు. ఎంఐఎం పార్టీ కామారెడ్డికి కొత్త కాదని.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం అభ్యర్థులకు ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రమంతా ఎంఐఎం పార్టీ విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఎన్‌ఆర్‌సీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని అసదుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింలకు తప్ప అందరికీ పొరసత్వం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై అనేక అనుమానాలు ఉన్నాయిని ఎంపీ అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు.
చదవండి: అసదుద్దీన్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు