సాక్షి, హైదరాబాద్ : తనను భారతదేశం నుంచి వెళ్లగొట్టే దమ్మూ, ధైర్యం ఎవరికీ లేవని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందంటూ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కాగా యోగి వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందిస్తూ... ‘భారతదేశం నా తండ్రి దేశం. స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆడమ్ అని ఇస్లాం నమ్ముతుంది. ఆయన మొదట వచ్చింది కూడా ఇండియాకే. కాబట్టి ఇది నా తండ్రి దేశం అందుకే ఇక్కడి నుంచి నన్ను ఎవ్వరూ ఎక్కడికీ పంపలేరు’ అని వ్యాఖ్యానించారు.
యోగి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్న ఒవైసీ... ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను విడిచి పారిపోలేదు. రాజ్‌ప్రముఖ్‌గా సేవలు అందించారు. చైనాతో యుద్ధం జరిగినపుడు తన బంగారమంతా దానం చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి. అయినా సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాలు లేక 150 మంది చిన్నారులు చనిపోతే ఏమీ చేయలేని అసమర్థ సీఎం తన మాటలతో నన్ను బెదిరించలేరు’ అంటూ ఘాటుగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment