
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 25న 28 పార్టీలతో కలసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ప్రారంభం కానుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయాలని లెఫ్ట్, బహుజన నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌లో 25న భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఈ వేదికను ప్రకటించనున్నారు. బహిరంగ సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ఎంసీపీఐ (యూ) జాతీయ నేత ఎం.డి.గౌస్ హాజరు కానున్నారు. గురువారం హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుపై సన్నాహక సమావేశం జరిగింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాకి మాధవరావు, పి.ఎల్. విశ్వేశ్వరరావు, సాంబ శివరావు, గద్దర్, పటేల్ వనిత, మాజిదుల్లా ఖాన్ తదితరులు సమా వేశంలో పాల్గొన్నారు. బీఎల్‌ఎఫ్ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు.
పూలే, అంబేడ్కర్ ఆలోచనలతో..
పూలే–అంబేడ్కర్–మార్క్స్ ఆలోచనల మేళవింపుతో ఫ్రంట్‌కు రూపకల్పన చేశామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇప్పుడున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయంగానే బహు జన్ లెఫ్ట్ ఫ్రంట్ రూపుదిద్దుకుందన్నారు. ఫ్రంట్‌లో ఇప్పుడున్న 28 పార్టీలతో పాటు సీపీఐ, న్యూడెమోక్రసీతో పాటు ఇతర వామ పక్ష పార్టీలను కూడా చేరాలని ఆహ్వాని స్తున్నామని తమ్మినేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment