
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడా జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోని తీసుకోవడాన్ని నిరశిస్తూ అసెంబ్లీ ముందు చేపట్టిన ధర్నా ముగింపు సందర్భంగా భట్టి మాట్లాడారు. డబ్బులు చెల్లించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం టీఆర్‌ఎస్ వికృత చర్యగా ఆయన వర్ణించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని గిరిజనులను, ఆదివాసీలను మళ్లీ టీఆర్‌ఎస్ రాక్షస పాలనకు గురిచేస్తున్నారని భట్టి విమర్శించారు.