సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ఏదో ఉద్ధరించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తే జనాలు బీజేపీని నమ్మేవారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఇప్పుడున్న 5 స్థానాలు గెలిస్తే చాలు’అని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తానిపర్తి భానుప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. అప్పుడప్పుడు అమిత్ షా రాష్ట్రానికి వస్తే తప్ప ఇక్కడ బీజేపీ ఉందని తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ ఎలా ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. మరోవైపు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఎన్నికల భయం పట్టుకుందని, ఎన్నికల తర్వాత ఆయన గడ్డం పెంచి హిమాలయాలకు పోవాల్సిందేనన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఉత్తమ్ మోకరిల్లుతున్నారని, రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల్లో వాటాలు అడగమని బాబుతో హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలే సెటిలర్లలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారికి భరోసా ఇవ్వడానికే మంత్రి కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment