సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ప్రజా సమస్యలపై గళమెత్తుతోంది. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ చేపట్టిన చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర ఆదివారంతో బోధన్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా కమల దళం బల ప్రదర్శన చేయనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు పాల్గొననున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్మికులు, రైతులను తరలించేందుకు పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించింది. దీనికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సిం గ్ హాజరయ్యా రు. ఆ తర్వాత ఒకటి, రెండు నియోజకవర్గా ల్లో మినహా మిగిలిన ఉమ్మడి జిల్లా పరిధిలో చెప్పుకోదగిన పార్టీ కార్యక్రమాలేవీ జరగలేదు. తాజాగా చెరుకు రైతుల సమస్యతో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మార్చి 3న జగిత్యాల జిల్లా ముత్యంపేట్‌లో ప్రారంభమైన పాదయాత్ర.. తొమ్మిది రోజులపాటు ఈ పాదయాత్ర జగిత్యాల, బాల్కొండ, ఆర్మూ ర్, నిజామాబాద్‌రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో సాగింది. రైతులు, వివిధ వర్గాల నుంచి స్పందన రావడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఆదివారం ఉదయం బోధన్ ఆచన్‌ప ల్లి నుంచి చక్కెర కార్మాగారం వరకు ర్యాలీ నిర్వహించనున్నా రు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. హన్సరాజ్ గంగారాం ఆహేర్ హెలిక్యాప్టర్‌లో నేరుగా బోధన్‌కు చేరుకుంటారు. ఈ మేరకు బోధన్‌లో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.
వెలుగు చూసిన విబేధాలు..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ప్రతిపాదన మేరకు పార్టీ ఈ పాదయాత్రపై నిర్ణయం తీసుకుంది. అయితే, పార్టీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ వర్గం పాదయాత్రకు తొలుత అభ్యంతరం తెలిపినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా కోర్ కమిటీని నియమించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. యెండల వర్గం గైర్హాజరు కావడంతో ఈ కమిటీ సమా వేశాలు పలుమార్లు వాయిదా పడింది. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని పాదయాత్రపై నిర్ణయం తీసుకుంది. పాదయాత్రను అరవింద్ ప్రతిష్టాత్మకంగా చేపట్టగా.. వ్యతిరేకించిన యెండల వర్గం అంటీముట్టనట్లు వ్యవహరించినా.. తర్వాత ముఖ్యనేతలు కలగజేసుకోవడంతో పాదయాత్రలో పాల్గొంది. బోధన్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి తెలిపారు. సభకు రైతులు, వివిధ వర్గాల ప్రజలు, కార్మికు లు, పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment